టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు(Nandamuri Balayya) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు బాలయ్య(Balayya) సినిమాలలో డైలాగ్స్ మరింత స్పెషల్ గా ఉంటాయని చెప్పవచ్చు.నారా భువనేశ్వరి బాలయ్య (Nara Bhuvaneswari, Balayya)గురించి ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
కాలేజ్ లో ఏదో చదువుకోవడం పాస్ అవ్వదం అలా పెరిగానని ఆమె కామెంట్లు చేశారు.ఏ హీరోలా ఏ హీరోయిన్ లా ఉండాలని నేను ఫీల్ కాలేదని భువనేశ్వరి వెల్లడించారు.
19 సంవత్సరాల వయస్సులోనే నాకు పెళ్లి అయిందని ఆమె పేర్కొన్నారు.నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తానని భువనేశ్వరి తెలిపారు.
బాలయ్య నాకు అన్న అని నాకంటే రెండు సంవత్సరాలు పెద్ద అని ఆమె చెప్పుకొచ్చారు.సమరసింహారెడ్ది, నరసింహ నాయుడు, అఖండ (Samarasimha Reddy, Narasimha Naidu, Akhanda)సినిమాలు బాలయ్య సినిమాలలో ఇష్టమని ఆమె తెలిపారు.
ఒకవైపే చూడు మరోవైపు చూడొద్దంటూ భువనేశ్వరి మాట్లాడుతూ నవ్వుల పువ్వులు పూయించారు.
భువనేశ్వరి బాలయ్య డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.మరోవైపు బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
బాలయ్య డాకు మహారాజ్ తో మరోసారి ఫ్యాన్స్ ను మెప్పించడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు.
సితార నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్ మూవీ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బాలయ్య సినిమా కోసం నిర్మాతలు ఖర్చు విషయంలో మాత్రం అస్సలు రాజీ పడలేదని సమాచారం అందుతోంది.బాలయ్య మార్కెట్ ను మించి నిర్మాతలు ఈ సినిమా కోసం ఖర్చు చేశారని భోగట్టా.