సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బుల్లితెర నటి హిమజ(Himaja ) ఒకరు మొదట్లో పలు సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ హిమజ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈమె సినిమాలు సీరియల్స్ మాత్రమే కాకుండా బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు క్యాస్టింగ్ కౌచ్(Casting couch)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా ఈ విషయం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.తాను తన కెరీర్లు ఇప్పటివరకు ఇలాంటి అనుభవాలను ఎప్పుడు ఎదుర్కోలేదని,కమిట్మెంట్ అంటే ఏంటో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు.ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి అవకాశం రావాలి అంటే కూడా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందా? అనే ప్రశ్న ఎదురయింది ఇక ఈ ప్రశ్నకు హిమజ సమాధానం చెబుతూ బిగ్ బాస్ (Bigg Boss) అవకాశం రావాలి అంటే కమిట్మెంట్స్ అలాంటివి ఏమీ ఉండవని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎలాంటి వారు వస్తారు అంటే బిగ్ బాస్ లో సెలెక్ట్ అయి ముందుకొస్తున్నారంటేనే.వాళ్లందరూ స్ఫూర్తిగా ఉండే వాళ్ళు ఏది ఉన్న ముఖం మీద మాట్లాడేవారు.రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్స్ మాత్రమే బిగ్ బాస్ లో అడుగు పెడతారు.
అలాంటి వాళ్లతో ఇలాంటి కమిట్మెంట్స్ గురించి అడిగే ప్రసక్తి ఉండదని తెలిపారు.నేను బిగ్ బాస్ సెలెక్ట్ అవడం కోసం మూడు సార్లు ఇంటర్వ్యూ కి వెళ్లాను అయితే ఎక్కడ కూడా నాకు ఇలాంటి ఇబ్బంది కలగలేదు నాకు మాత్రమే కాదు ఈ విషయం గురించి నా ఫ్రెండ్స్ ని అడిగిన కూడా వారు కూడా అలాంటి ఫీలింగ్ ను ఎదుర్కోలేదని, తన ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారని, వారి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఓపెన్ గానే చెప్పేసింది.