పుష్ప అన్న కూతురి పాత్రకు కావేరి పేరు పెట్టడం వెనుక ఇంత పెద్ద రీసన్ ఉందా?

పుష్ప సినిమా ద్వారా ఎంతోమంది మంచి నటీనటులు మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా సక్సెస్ అందుకున్న వారిలో నటి పావని కరణం (Pavani karanam) ఒకరు.

 Pushpa Actress Pavani Revealed Behind The Story Her Role Name Kaveri, Kaveri, Pu-TeluguStop.com

పావని అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ పుష్ప అన్న కూతురు పాత్రలో నటించిన కావేరి(Kaveri ) అంటే మాత్రం అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తారు.ఇక పుష్ప 2 (Pushpa 2) లో కావేరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని ఈమె పాత్ర సినిమాని మలుపు తిప్పుతుందని తెలిసిందే.

అల్లు అర్జున్(Allu Arjun) చిన్నాయనా అని పిలుస్తూ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు కావేరి అని పేరు పెట్టడానికి గల కారణాన్ని ఈమె వెల్లడించారు.

Telugu Allu Arjun, Jatara, Kaveri, Pavani, Pushpa, Sukumar-Movie

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలో జాతర సీన్ వచ్చేవరకు నా పాత్రకు సుకుమార్(Sukumar ) గారు పేరు కూడా పెట్టలేదని తెలిపారు.అప్పటివరకు నన్ను అందరూ పావని అని మాత్రమే పిలిచేవారు.ఇక ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కూడా పావని అని నేను భావించాను.ఇక చివరికి సుకుమార్ సార్ గారు కూడా పావని అంటూ పిలవడంతో నేను అదే ఫిక్స్ అయ్యాను.

జాతర షూటింగ్ (jatara shooting) సమయంలో పావనినా నీ పేరు అంటే.అది నా ఒరిజినల్ పేరు.పాత్ర పేరు అని చెప్పా.వెంటనే నీ పాత్రకు నామకరణం చేస్తున్నాననీ కావేరి అని పేరు పెట్టారు.

Telugu Allu Arjun, Jatara, Kaveri, Pavani, Pushpa, Sukumar-Movie

ఇక కావేరి అని పేరు పెట్టడం వెనుక పెద్ద స్టోరీ ఉందని ఈమె తెలియజేశారు.కావేరి నది పేరు.ఈ నది అటు తమిళనాడును ఇటు కర్ణాటకను కలుపుతుంది.అలాగే ఇక్కడ నేను అటు పుష్ప కుటుంబాన్ని.మా కుటుంబాన్ని కలుపుతాను అని సింబాలిక్ గా ఆ పేరు పెట్టారు.ఇలా తన పాత్రకు కావేరి అని పేరు పెట్టడం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందని ఈమె తెలియజేయడంతో సుకుమార్ అనాలసిస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఒక పాత్ర పేరుకే ఇంత ఆలోచించావంటే దండం అయ్యా నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube