సౌందర్య మరణం గురించి  చెప్పిన నిజాలు మీకు తెలుసా?

హీరోయిన్ సౌందర్య.తెలుగు చిత్ర పరిశ్రమలో ఇక ఈ అమ్మడు గురించి తెలియనివారు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Soundarya Talks About Death , Soundarya , Death , Lady Oriented Movies , Glamor-TeluguStop.com

దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  హవా నడిపించింది సౌందర్య.తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ చీరకట్టులో తెలుగింటి ఆడపడుచుల ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

లేడి ఓరియెంటెడ్ సినిమాల దగ్గర్నుంచి గ్లామర్ పాత్రల వరకూ ప్రతిపాత్రలో కూడా దర్శక నిర్మాతలకు నెంబర్వన్ హీరోయిన్గా మారిపోయింది సౌందర్య.

అయితే సౌందర్యను తన తండ్రి డాక్టర్ చేయాలని ఎంతగానో కల కన్నాడు.కానీ సౌందర్య జాతకం ప్రకారం ఆమె సినీ నటి అవుతుందని ఉందట.ఇక నిజంగానే సౌందర్య సినీనటి గా మారిపోయింది.1972లోకర్ణాటకలో పుట్టిన సౌందర్య ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది.సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ.

ఇక అమ్మోరు, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, భలే బుల్లోడు సహా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్  సినిమాలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.అయితే 2004లోబీజేపీ  పార్టీలో చేరిన సౌందర్య ఇక ఈ ప్రచార సభకు హాజరయ్యేందుకు విమానంలో వెళ్తున్న సమయంలో చివరికి విమానం ప్రమాదంలో తుది శ్వాస విడిచారు అన్న విషయం తెలిసిందే.

అయితే ఈ విమాన ప్రమాదానికి ముందు సౌందర్య మరణం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం అటు అభిమానులు అందరినీ షాక్కు గురి చేసాయి అని చెప్పాలి.చావంటే తనకు ఎంతో భయం అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది సౌందర్య.చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు అని అంటారు కదా.స్వర్గం ఆకాశంలో ఉంటుందని నేను అనుకునే దాన్ని అంటూ చెప్పుకొచ్చారు.అయితే విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు చనిపోతే మేఘాలలోకి వస్తామని నేను అనుకుంటాను అంటూ తన చావు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సౌందర్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube