ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.అవి ముగిశాక దసరా పండుగను వైభవంగా జరుపుకుంటారు ప్రజలు… 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా కొందరు దుర్గామాత విగ్రహాలను కూడా పెడతారు.
అయితే మీకు తెలుసా.? ఈ 9 రోజుల పాటు.అంటే నవరాత్రులు జరిగినన్ని రోజులు మనం కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.అవేమిటో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ కట్
నవరాత్రుల్లో ఎవరూ హెయిర్ కట్ చేయించుకోకూడదట.అలాగే గుండు చేయించుకోవడం వంటి కార్యక్రమాలను కూడా పెట్టుకోకూడదట.ఎందుకంటే అలా చేస్తే దుర్గా దేవి ఆగ్రహిస్తుందట.దీంతో భక్తులకు కష్టాలు ఎదురవుతాయి.
కలశం
ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసేటప్పుడు దేవి ఎదుట కలశం ఉంచాలి.అలాగే దేవి ఎదుట అఖండ జ్యోతి వెలిగించాలి.
అది 9 రోజుల పాటు ఆరిపోకుండా చూడాలి.ఇక ఇంట్లో 9 రోజుల పాటు కచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి.
అంతేకానీ ఎవరూ లేకుండా ఇంటికి తాళం పెట్టరాదు.అలా చేయడం వల్ల దేవి అనుగ్రహం లభించదు…
నిమ్మకాయ
నవరాత్రులు జరిగినన్ని రోజులు ఇంట్లో నిమ్మకాయను కోయరాదట.అలా చేస్తే అరిష్టం కలుగుతుందట.కానీ మరి నిమ్మరసం లేకపోతే ఎలా.అంటే అందుకు పరిష్కారం ఉంది.మార్కెట్‌లో దొరికే నిమ్మరసం బాటిల్స్‌ను వాడవచ్చు.
నిద్ర
నవరాత్రుల పాటు రోజూ ఉపవాసం ఉండే వారు మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోరాదు.నిద్రపోతే పూజలు చేసినా ఫలితం ఉండదు.
ఉపవాసంలో తీసుకోవలసిన జాగ్రత్తలు.
నవరాత్రుల్లో రోజూ ఉపవాసం చేసే వారు కొద్ది మొత్తంలో పండ్లను ఆకలి అనిపించినప్పుడు తినవచ్చు.అంతేకాదు నవరాత్రి రోజుల్లో నీటిని బాగా తాగాలి.దీంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
నీటిని తాగడం వలన ఉపవాసం ఉన్నా ఆకలి అనిపించదు.ఉపవాసం చేసేటప్పుడు ఆలుగడ్డలు తప్ప ఇతర ఏ కూరగాయలను తినరాదు.
వాటిని కూడా ఉడకబెట్టుకుని అలాగే తినవచ్చు.కానీ కూరలా చేసి తినరాదు.
నవరాత్రుల్లో ఉపవాసం చేయని వారు రోటీ, పూరీ తినాలి.సామలు అని పిలవబడే ఓ రకమైన తృణధాన్యం మనకు మార్కెట్‌లో దొరుకుతుంది.
దాంతో అన్నం వండి తినాలి.ఫాక్స్ నట్స్ అని పిలవబడే నట్స్‌ను రోస్ట్ చేసి.
అందులో నెయ్యి వేసుకుని తినవచ్చు.నవరాత్రి వంటకాల్లో చక్కెరను వాడరాదు.
బెల్లం లేదా తేనె వాడవచ్చు.
LATEST NEWS - TELUGU