మన కష్టాలు దూరం చేసే దేవుళ్ళలో కాలభైరవుడు( Kalabhairava ) కూడా ఖచ్చితంగా ఉంటాడు.ఈయనను పూజిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే కాలభైరవుడిని ఆరాధిస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి.ఇంట్లోనీ బాధలు సమస్యలు దూరం చేయడంలో కాలభైరవుడు ఎప్పుడు ముందున్నాడు.
అందుకే పండితులు కాలభైరవుడిని ఆరాధించమని చెబుతూ ఉంటారు.శునకాన్ని కాలభైరవుడు అని అంటారు.
అది దేవుడితో సమానం.ముఖ్యంగా చెప్పాలంటే కాలభైరవుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అలాగే ఏ రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే శునకం మీద నాలుగు భుజాలతో త్రిశూలం, కపాలి, అభయ ముద్ర, అగ్నిహోత్రం పట్టుకుని కూర్చుంటాడు.కాల భైరవుడి అనుగ్రహం ఉంటే కాశీలో కూడా అడుగు పెట్టగలమని పండితులు చెబుతూ ఉంటారు.కాలభైరవుడి కరుణ లేకపోతే కాశీకి వెళ్లలేమని చెబుతారు.
కాలభైరవుడిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.కాలభైరవుడిని శనివారం ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల సమయంలో ఆరాధించాలి.
స్వామికి దీపారాధన అంటే ఎంతో ఇష్టం.బూడిద గుమ్మడికాయను సగం కట్ చేసి అందులో కొద్ది భాగాన్ని తొలగించి అందులో నువ్వుల నూనె పోసి,అలాగే అందులో తోక మిరియాలు వేయాలి.
తర్వాత ఎర్రని వస్త్రంతో ఒత్తిని చేసి నూనెలో ఉంచాలి.బూడిద గుమ్మడికాయను( Gray pumpkin ) రాళ్ల ఉప్పు పోసి దానిపై ఉంచాలి.అప్పుడు దీపాన్ని వెలిగించి స్వామివారికి చూపిస్తే మన కష్టాలు దూరం అయిపోతాయి.ఇంకా చెప్పాలంటే 27 నక్షత్రాలు, 12 రాశుల వారు కాలభైరవుడిని పూజించవచ్చు.ఇంకా చెప్పాలంటే అటుకులు, కొబ్బరి, పాలు, పంచదార, బెల్లం నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది.ఇలా స్వామి వారిని పూజించడం వల్ల కష్టాలు దూరం అయిపోతాయి.
అలాగే భోగభాగ్యాలు కలుగుతాయి.ఇలా కాలభైరవుడిని ఆరాధించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అని పండితులు చెబుతున్నారు.
TELUGU BHAKTHI