మానవ జీవితంలోని అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి బాధలను తొలగించడానికి హిందూమతంలో వేదమాత గాయత్రి ఆరాధన ఉత్తమంగా పరిగణిస్తారు.హిందూ విశ్వాసాల ప్రకారం అన్ని వేదాలకు తల్లిగా పరిగణించబడే గాయత్రీ దేవి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
గాయత్రీ దేవి ఈ రోజున జన్మించిందని చాలామంది ప్రజలు నమ్ముతారు.హంసను వాహనంగా కలిగి ఉన్న గాయత్రీ దేవి ఒక చేతిలో నాలుగు వేదాలు, మరో చేతిలో కమాండలం ఉంటుంది.
వేదమాత గాయత్రీ జననానికి సంబంధించిన పవిత్ర పండుగ గాయత్రి జయంతి అని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే సనాతన హిందూ సంప్రదాయంలో గాయత్రి దేవినేని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆదిదేవతగా పూజిస్తారు.గాయత్రీ దేవి, సరస్వతి దేవి, లక్ష్మీదేవి, పార్వతి దేవిల అవతారమని గాయత్రి దేవి( Gayatri Devi )ని పూజిస్తే అన్ని రకాల ఆనందాలు, అదృష్టలు లభిస్తాయి అని చాలామంది ప్రజలు నమ్ముతారు.గాయత్రి దేవి ఆరాధనలో జపించే మంత్రం జీవితానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
అలాగే ఆశించిన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రీ జయంతి( Gayatri Jayanti ) రోజున గాయత్రీ దేవిని ఆరాధించడానికి సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం, ధ్యానం చేసిన తర్వాత ముందుగా ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
దీని తర్వాత ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరిచి తల్లి గాయత్రీ దేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి.ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు పాలు, ధూప దీపాలు తదితరాలను సమర్పించాలి.గాయత్రీ జయంతి రోజు వేదమాత అనుగ్రహం పొందడానికి గాయత్రి మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు జపించాలి.గాయత్రి మాతను ఆరాధించిన తర్వాత చివరలో హారతిని ఇచ్చి అందరికీ ప్రసాదం పంచిపెట్టి ఆ తర్వాత మీరు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం ఎప్పుడు మీ ఇంటిపై ఉంటుంది.
హిందూమతంలో గాయత్రి మంత్రం అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి ఉత్తమంగా పరిగణిస్తారు.ఎవరైనా నిర్మలమైన మనసుతో నిర్ణిత సమయంలో 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే సంతోషాలు, అదృష్టాలు, ఆరోగ్యం లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.
ఈ మంత్రం ప్రతిరోజు మూడు నెలల పాటు నిరంతరం జపించే భక్తుడు లక్ష్మీదేవి విశేషా అనుగ్రహాన్ని పొందుతాడని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL