మునుగోడు ఉపఎన్నికపై సీఈఓ సమీక్ష

మునుగోడు ఉపఎన్నిక సీఈఓ వికాస్ రాజ్ సమీక్ష నిర్వహించారు.చండూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం అయ్యారు.

 Ceo Review On Munugode By-election-TeluguStop.com

దీనిలో భాగంగా బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలను పరిశీలించారు.అనంతరం మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగే చర్యలు తీసుకున్నామని తెలిపారు.నిఘా టీములు, పోలీస్ బందోబస్తు పెంచామన్నారు.

కేంద్ర బలగాలు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.అదేవిధంగా బెల్ట్ షాపుల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచామన్న ఆయన.నిబంధన ఉల్లంఘన, అవకతవకలపై కాల్ చేయొచ్చని తెలిపారు.వీధుల్లో నిర్లక్ష్యం చేసినందుకే ఆర్ఓ, తాసిల్దార్ పై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.డబల్ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ల ఓట్లే తొలగించి ఉంటారని, ఇప్పుడు కొత్త ఓటర్ల నమోదు సాధ్యం కాదని సీఈఓ వికాస్ రాజు తెలిపారు.

ఈసీ నిబంధనల మేరకే గుర్తులు కేటాయించామని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube