అధిక ఒత్తిడి, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, ధూమపానం మద్యపానం వంటి చెడు వ్యసనాలు, కాలుష్యం, కెమికల్స్( Bad habits, pollution, chemicals ) అధికంగా ఉండే కేశ ఉత్పత్తులను వినియోగించడం తదితర కారణాల వల్ల ఒక్కో టైమ్ లో జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది.ఆ సమయంలో ఏం చేయాలో తెలియక.
ఎలా జుట్టు రాలే సమస్యను అడ్డుకోవాలో అర్థం కాక సతమతమవుతుంటారు.టెన్షన్ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీతో రెండు వారాల్లోనే హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో వాటర్ జెల్లీగా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.అవిసె గింజల జెల్ కూల్ అయ్యేలోపు మిక్సీ జార్ లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు( onion slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ ఉల్లిపాయ జ్యూస్ ను అవిసె గింజల జెల్ లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) కూడా వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే హెయిర్ రూట్స్ దృఢంగా మరుతాయి.జుట్టు రాలే సమస్య వేగంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించడం వల్ల కొత్త జుట్టు ఎదుగుదల మెరుగుపడుతుంది.
కురులు మృదువుగా, షైనీ గా మారతాయి.పొడి జుట్టు సమస్య దూరం అవుతుంది.
కాబట్టి జుట్టు విపరీతంగా రాలిపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.