తెలుగు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు లోనవుతున్న వ్యవహారం అలేఖ్య చిట్టి పిక్కిల్స్(Alekya Chitti Pickles) ఘటన.ఇంటి తయారీ పిక్కిల్స్‌తో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి సిస్టర్స్ ఇప్పుడు అదే మీడియా వేదికపై తీవ్ర విమర్శలకు గురవుతున్నారు.
వ్యాపార ప్రమోషన్ కోసం వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి వచ్చిన ఈ సిస్టర్స్ తాజాగా బూతు మాటలతో నెటిజన్ల అగ్రహానికి గురయ్యారు.
తాజాగా అలేఖ్య చిట్టి( Alekya Chitti) మాట్లాడిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అందమైన ముఖాలు పెట్టుకుని, అలాంటి అశ్లీల భాష వాడటం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.అంతేకాకుండా తిట్టిన కస్టమర్లలో ఒక్కరినైనా పెళ్లి చేసుకోవాలని ట్రోలింగ్ స్థాయిని మరింతగా పెంచారు.
వీరి వ్యాఖ్యలు మహిళలపై అవమానంగా ఉన్నాయని, కస్టమర్లను కించపరిచే విధంగా మాట్లాడడం తగదని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఈ దెబ్బతో అలేఖ్య చిట్టి పిక్కిల్స్(Alekya Chitti Pickles)వ్యాపారం పూర్తిగా మూతపడినట్లు తెలుస్తోంది.
నెగెటివ్ ట్రోల్స్ కారణంగా తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని అలేఖ్య సోదరి సౌమ్య ఎమోషనల్‌గా (Alekhya’s sister Soumya is emotional)వెల్లడించింది.తన చెల్లెలు అలేఖ్య బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆ వీడియోను సైతం సోషల్ మీడియాలో విడుదల చేసింది.
మూడు నెలల క్రితమే తండ్రిని కోల్పోయిన తమ కుటుంబానికి ఇంకో ఇలాంటీ పరిస్థితి ఎదురైతే తట్టుకోలేమని, అందుకే ఇప్పటికైనా నెటిజన్లు వదిలిపెట్టాలని సౌమ్య (Soumya)కన్నీటి విజ్ఞప్తి చేసింది.“మేము సారీ చెబుతున్నాం… మా తప్పుకు మేం బాధ్యత వహిస్తున్నాం… కానీ దయచేసి మమ్మల్ని మానవత్వంతో చూడండి” అంటూ భావోద్వేగానికి గురైంది.అలేఖ్య చిట్టి గతంలో పిక్కిల్స్ ధరలపై కస్టమర్ ప్రశ్నలకు ఘాటు బదులిస్తూ, “పచ్చళ్లను కొనలేని వాడికి పెళ్లాం ఏం, లవర్ ఏం అవసరం?” అంటూ మాట్లాడిన వీడియో వైరలైంది.అంతేకాకుండా, ఇతర మహిళా కస్టమర్లపై తీవ్రంగా అసభ్య పదజాలాన్ని వాడిన వీడియోలూ వెలుగులోకి వచ్చాయి.దీంతో ఆమెపై సోషల్ మీడియాలో గట్టి ఫైర్‌బ్యాక్ వచ్చింది.
ఇక ఈ వివాదం ఎటు దారి తేలుతుందో తెలియదు కానీ, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు సరైందో అన్న చర్చ మరోసారి ప్రారంభమైంది.తప్పు చేసినవారికి బుద్ధి చెప్పే న్యాయం ఒకవైపు అయితే… వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు కూడా చూడాల్సిన సమయం ఇది.