న్యూస్ రౌండప్ టాప్ 20

1.  కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

మంత్రి కేటీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.రాహుల్ గాంధీ కాలిగోటికి సరిపోని స్థాయి నీది డ్రామారావు అంటూ విమర్శించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Kcr,ktr, Te-TeluguStop.com

2.మూడో జాబితా పై కిషన్ రెడ్డి కామెంట్స్

బిజెపి మూడో విడత జాబితా పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కామెంట్ చేశారు.ఈరోజు సాయంత్రం జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

3.రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై బిజెపి ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు .బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ఆయన సభలో బీసీలను అవమానించేలా రాహుల్ మాట్లాడారని విమర్శించారు.

4.చంద్రబాబుపై ఈటెల విమర్శలను ఖండించిన టిడిపి

తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలుపెడుతున్నారంటూ బిజెపి నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ స్పందించారు.బీసీ వర్గాలను ప్రోత్సహించిన చంద్రబాబుపై ఈటెల కామెంట్స్ చేయడం అర్ధరహితం అని మండిపడ్డారు.

5.భవాని దీక్ష షెడ్యూల్ విడుదల

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష షెడ్యూల్ విడుదలైంది .ఈనెల 27 నుంచి భవాని దీక్షలు ప్రారంభమవుతాయి.

6.ఏపీలో మరో కొత్త పార్టీ ప్రారంభం

ఏపీలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది .ఏపీ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బారాయన్ ప్రకటించారు.

7.కేటీఆర్ కామెంట్స్

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

తెలంగాణలో మరోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

8.కెసిఆర్ పై రేవంత్ విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.కేసీఆర్ అంటే కాలేశ్వరం కరప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని రేవంత్ విమర్శించారు.

9.నాదెండ్ల మనోహర్ విమర్శలు

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల 85 వేల పశువులు మాయం అయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.పశువుల అదృశ్యం వెనక వైసీపీ నేతల హస్తం ఉందని నాదెండ్ల విమర్శించారు.

10.కెసిఆర్ పై పొంగులేటి విమర్శలు

అరాచకంగా సంపాదించిన డబ్బుతో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని అంటున్నారని , అరాచక అనే నైతిక హక్కు నీకు ఉందా కేసీఆర్ అని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

11.రాష్ట్ర వ్యాప్తంగా లారీల సమ్మె

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

తమిళనాడులోని లారీలకు విధించే త్రైమాసిక వార్షిక పన్నులు 40 శాతం మేరకు పెంచడాన్ని నిరసిస్తూ ఈనెల 9న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టాలని తమిళనాడు లారీ యజమానుల సంఘం నిర్ణయించింది.

12.కిచ్చాన్న గారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటి సోదాలు

మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఈరోజు తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు .రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్ పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

13.ధరణి ఉండాలా పోవాలా : కేసీఆర్

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధరణి పోర్టల్ పై కేసీఆర్ స్పందించారు.ధరణి ఉండాలా పోవాలా మీరే చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు.

14.విశాఖలో ఐసిఐడి ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ప్లీనరీ

విశాఖ ఋషికొండ ఐటీ హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఐసిఐడి కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ , కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్ సింగ్  షెకావత్ తో పాటు , రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు , విడుదల రజిని,  గుడివాడ అమర్నాథ్ దేశ విదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

15.అచ్చెన్న నాయుడు కామెంట్స్

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసిపి నేతలకు ఇబ్బంది ఏంటని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రశ్నించారు.

16.విజయశాంతి కామెంట్స్

సినిమాల్లోని ద్వీపత్రాభినయం రాజకీయాల్లో సాధ్యపడదని బిజెపి నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.

17.ఢిల్లీ మంత్రి నివాసంలో ఈడి సోదాలు

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన మరో నేత మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇంట్లో ప్రస్తుతం ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

18.కాసాని జ్ఞానేశ్వర్ పై కేసు

బంజారాహిల్స్ లోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలోకి తాను వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ గుడి మల్కాపూర్ కు చెందిన టిడిపి నేత గోషామహల్ సమన్వయకర్త డాక్టర్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

19.ఏపీలో గ్రూప్ వన్ నోటిఫికేషన్లు

ప్రభుత్వ శాఖల్లోని 163 ఉద్యోగాల భర్తీకి వేరువేరు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

20.చంద్రబాబుకు నేడు వైద్య పరీక్షలు

Telugu Achhenna, Ap Cm Jagan, Ap, Chandrababu, Etela Rajender, Jagan, Kishan Red

టిడిపి అధినేత చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు.అక్కడ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రలజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.వారి సూచన మేరకు ఈరోజు చంద్రబాబు ఏఐజి కి వెళ్లి పరీక్షలు చేయించుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube