ప్రపంచం తలకిందులైనా, భూకంపాలు వచ్చినా, అణుబాంబులు పేలినా, ఏం జరిగినా తమకేం కాకుండా ఉండాలని కోటీశ్వరులు( Millionaires ) ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.అపర కుబేరుల కోసం ఓ అమెరికన్ కంపెనీ అదిరిపోయే ప్రాజెక్టును రెడీ చేస్తోంది.
దానికి పేరు కూడా భలే పెట్టారు.అదేంటంటే “ఏరీ ప్రాజెక్ట్”( Aerie Project ) పక్షుల గూడు ఎంత పదిలంగా ఉంటుందో, ఈ బంకర్లు( Bunkers ) కూడా అంతే భద్రంగా ఉంటాయట.
అమెరికాకు చెందిన స్ట్రాటెజికల్లీ ఆర్మర్డ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్‌మెంట్స్( SAFE ) అనే సంస్థ ఈ వినూత్న ప్రాజెక్టుతో ముందుకొచ్చింది.అక్షరాలా 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2500 కోట్లు) భారీ పెట్టుబడితో ఈ బంకర్లను నిర్మిస్తున్నారు.2026 నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఫోర్బ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యి లగ్జరీ బంకర్లను( Luxury Bunkers ) నిర్మించాలని SAFE సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.అందులో 50 బంకర్లు ఒక్క అమెరికాలోనే ఉండబోతున్నాయి.వర్జీనియాలో( Virginia ) మొదటి బంకర్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.ఒక బంకర్‌లో ఏకంగా 625 మంది వరకు తలదాచుకోవచ్చట.
ఇక ధర విషయానికొస్తే, ఒక్కో బంకర్ ధర అక్షరాలా 20 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో 160 కోట్ల రూపాయలు పైమాటే.అందరికీ ఈ బంకర్లు అమ్మరు.
ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లో సభ్యత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ బంకర్లు మామూలుగా ఉండవు.వైట్ హౌస్ స్థాయిలో భద్రత ఉంటుందట.ఈ విషయాన్ని స్వయంగా SAFE సంస్థ వ్యవస్థాపకుడు అల్ కోర్బీ వెల్లడించారు.
అత్యంత రహస్య సమాచారాన్ని భద్రపరిచే ప్రత్యేక గదులు (SCIF), అత్యాధునికమైన బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వైద్య సదుపాయాలు, పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనాలు, వెల్నెస్ ప్రోగ్రామ్స్, ఇలా లగ్జరీకి లగ్జరీ, భద్రతకు భద్రత లభిస్తుంది.

భూమి లోపల దాదాపు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో సూట్ ఉంటుంది.ఇంకా పెద్ద ఇల్లు కావాలంటే 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెంట్‌హౌస్‌లు కూడా ఉన్నాయి.ఇంటరాక్టివ్ వాల్స్, పనోరమిక్ వ్యూస్‌ను చూసేలా సిమ్యులేటెడ్ విండోస్, మల్టీ-లేయర్ బయోమెట్రిక్ సెక్యూరిటీ, వ్యూహాత్మకమైన భద్రతా వలయాలు ఇలా ఒకటేమిటి, ప్రతిదీ టాప్ క్లాస్ ఫీచర్లే ఉంటాయి.
బంకర్ లోపల స్విమ్మింగ్ పూల్, మసాజ్ పార్లర్, ఐస్ ప్లంగ్ రూమ్, హైపర్‌బారిక్ ఛాంబర్ (ప్రత్యేక గాలి పీల్చే గది), ఐవీ థెరపీ రూమ్ ఇలా అన్నీ ఉంటాయి.
కొనేముందు శాంపిల్ చూడాలనుకుంటే.అదీ చూసే వెసులుబాటు కూడా ఉంది.ఆరోగ్యం, సంపద, భద్రత.ఈ మూడు కలగలిపి ఒకేచోట ఉండాలని కోటీశ్వరులు కోరుకుంటున్నారని, అందుకే ఈ ప్రాజెక్టుకు ఇంత డిమాండ్ ఉందని SAFE సంస్థ మెడికల్ ప్రిపేర్డ్‌నెస్ డైరెక్టర్ నయోమి కోర్బీ అంటున్నారు.
మొత్తానికి ప్రళయం వచ్చినా ఏమీ కాదు, హాయిగా బంకర్‌లో సేఫ్‌గా ఉండొచ్చన్నమాట.