76వ గణతంత్ర వేడుకలను( 76th Republic Day ) ఆదివారం భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు , శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.ఇక భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు( NRI’s ) గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
పలుదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు, ఇండియన్ కాన్సులేట్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
చైనా రాజధాని బీజింగ్‌లోని( Beijing ) భారత రాయబార కార్యాలయం ఆవరణలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులు, డయాస్పోరా సభ్యులు హాజరయ్యారు.
చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ .రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలను చదివి వినిపించారు.శ్రీలంక రాజధాని కొలంబోలో.( Colombo ) రెండు దేశాల మధ్య సాంస్కృతిక సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ భారతీయ దేశభక్తి గీతాలను ప్రదర్శించారు.
సింగపూర్‌లో( Singapore ) జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో భారత హైకమీషనర్ శిల్పక్ అంబులేతో పాటు సింగపూర్‌లో నివసిస్తున్న దాదాపు 2500 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.దేశ పురోగతిపై ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు అంబులే.ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి హర్ష్ కే జైన్ .ఇండియా హౌస్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు.ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది వరకు ప్రవాస భారతీయులు హాజరయ్యారు.అనంతరం భారత్ కో జానియే క్విజ్‌లో ఫిలిప్పీన్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి సర్టిఫికెట్ల ప్రధానం జరిగింది.
ఇండోనేషియాలో( Indonesia ) గణతంత్ర వేడుకలను భారతీయ కమ్యూనిటీతో పాటు స్థానికులు ఉత్సాహంగా జరుపుకున్నారు.ఇండోనేషియాలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ బిజయ్ సెల్వరాజ్ జకార్తాలోని మెంటెంగ్ పులోలోని కామన్‌వెల్త్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని అమరులైన భారత సైనికులకు నివాళులర్పించారు.