దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలుకాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తదుపరి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేయబోతున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.అయితే ఇప్పటికే మహేష్ బాబుని లాక్ చేసిన జక్కన ఈ సినిమా షూటింగ్ ఫారిన్ లో షురూ చేసినట్లు తెలుస్తోంది.
కానీ ఒక్కటి తక్కువైంది.

అదేంటంటే.గుట్టుచప్పుడు కాకుండా రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే.ఇది పక్కనా పెడితే ఆయన గత ఏడాది అక్టోబర్ లో కెన్యాలోని( Kenya ) అంబోసెలి నేషనల్ పార్క్ ని సందర్శించారు.
అక్కడ SSMB 29 షూట్ కి ప్లాన్ కూడా చేశారట.తాజాగా మూవీ టీమ్ అంతా కెన్యాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.జక్కన్నతో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అంబోసెలి నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం.

కానీ ప్రస్తుతానికి మహేష్ బాబు సన్నివేశాలను తెరకెక్కించలేదని తెలుస్తోంది.మరోవైపు అనుకున్న దానికంటే ముందే మూవీ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆమె ఈ సినిమాలో ఫైనల్ అయినట్లు శనివారం ఆమె చేసిన పోస్ట్ తో దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది.
రాజమౌళి అన్ని రకాలుగా ఆలోచించే ప్రియాంకాను ఫైనల్ చేశారని టాక్.అయితే ప్రియాంక రాక ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చట్లేదని టాక్ నడుస్తోంది.మహేష్ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందన్నది అభిమానుల వాదన.ప్రియాంక వయసు 42.మహేష్ తో పోలిస్త ఏడేళ్లు చిన్నదే.కాకపోతే ఈ జోడీ అంత చూడ ముచ్చటగా ఉండదన్నది హీరో ఫ్యాన్స్ భయం.ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.ప్రియాంక కంటే మంచి హీరోయిన్ ని వెదికి పట్టుకోవాల్సింది కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరి ఈ విషయంలో రాజమౌళి తన మనసును మార్చుకుంటారేమో చూడాలి మరి.







