కన్నడలో బిగ్‌బాస్ సీజన్ 11( Kannada Bigg Boss 11 ) తాజాగా ముగిసింది.మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు.
దాదాపుగా 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్ కి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్( Kichcha Sudeep ) హోస్ట్‌గా కొనసాగిన విషయం తెలిసిందే.జనవరి 26న బిగ్‌బాస్ ఫైనల్ ముగిసింది.
దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు.అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిగ్‌బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హనుమంత( Hanumantha ) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కర్ణాటక లోని హవేరికి చెందిన హనుమంత మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు.తన సొంతూరు లోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు.2018 లో సరిగమప కన్నడ సంగీతం షోలో హనుమంత రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్ తోనూ మెప్పించాడు.
ఈ గుర్తింపుతో బిగ్‍బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా 21వ రోజున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు.
చివరకు కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విజేతగా( Kannada Bigg Boss 11 Winner ) నిలిచాడు.ఇకపోతే హనుమంత బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను ఎంత గెలుచుకున్నాడు అన్న విషయానికొస్తే.ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు.అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా రన్నరప్ గా త్రివిక్రమ్ నిలిచారు.తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు.విజేత హనుమంతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి.రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ.10 లక్షలు గెలుచుకున్నారు.