మధుమేహం ఉన్నవారిలో వ్యాయామం కీలకమైన పాత్రను పోషిస్తుంది.వీరు వ్యాయామాన్ని పరిమితంగా చేయాలి.
ఎక్కువగా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.అందువల్ల కొన్ని రోజులు నిపుణుల సంరక్షణలో చేసి ఆ తర్వాత మీరే చేసుకోవచ్చు.
వ్యాయామం చేయటం వలన సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్లు, సెరటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది.కండరాలు పటిష్టంగా మారతాయి.
అంతేకాక కణాలు ఇన్సులిన్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.
మధుమేహం వ్యాధి ఉన్నవారు పాదాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
పాదాలకు సెట్ అయ్యే విధంగా పాదరక్షలను ఎంపిక చేసుకోవాలి.
వ్యాయామం చేసే ముందు, తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటే ఎంత వ్యాయామం చేస్తే సరిపోతుందో అర్ధం అవుతుంది.
ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.
హై బ్లడ్ షుగర్ కన్నా లో బ్లడ్ షుగర్ చాలా ప్రమాదం.
అందువల్ల వ్యాయామం చేసే ముందు కొంచెం స్నాక్స్ తీసుకోవటం మంచిది.
వ్యాయామం చేయటానికి వెళ్ళేటప్పుడు క్యాండీస్, గ్లూకోజ్ బిస్కట్లు, జ్యూస్ వంటివి తీసుకువెళ్లడం మంచిది.
ఎందుకంటే సడన్ గా గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు తీసుకోవటానికి ఉపయోగపడతాయి.