కలియుగంలో అత్యంత ప్రభావంతమైన దేవతలలో హనుమంతుడు( Hanuman ) ప్రధాన దేవుడు.కలియుగంలో ఎవరినైనా ప్రసన్నం చేసుకోవాలంటే వెంటనే గుర్తు వచ్చేది హనుమంతుడే అని చెబుతూ ఉంటారు.
మంగళవారం, శనివారాలు హనుమంతుని పూజించడానికి పవిత్రమైన రోజులుగా భావిస్తారు.చాలామంది హనుమంతునీ చిత్రాలు లేదా విగ్రహాలను ప్రతిష్టించుకుంటూ ఉంటారు.
కానీ హనుమంతుని ఇలాంటి చిత్రాలు పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.ఇటువంటి చిత్రాలు ప్రయోజనానికి బదులుగా హానినీ కలిగిస్తాయి.
హనుమంతుని ఏ చిత్రాలను ఇంట్లో ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే హనుమంతుడు శక్తివంతుడు, తెలివైనవాడు.మీరు మీ పూజ గృహంలో కొన్ని హనుమంతుని చిత్రాలను ఉంచవచ్చు.కానీ హనుమంతుని రుద్ర అవతారం పూజ గదిలో ఉంచకూడదు.
ఇది మీకు మంచిది కాదు.దీనికి విరుద్ధంగా ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఇంకా చెప్పాలంటే పూజ గృహంలో పంచముఖి హనుమంతుని చిత్రం ( Panchamukhi hanuman )లేదా విగ్రహాన్ని ఉంచుతారు.పొరపాటున కూడా ఇలా చేయకూడదు.
పంచముఖి హనుమంతుని విగ్రహం లేదా ఫోటో దేవాలయంలో పెడితే తంత్ర మంత్ర సాధనలో హనుమంతుడిని పూజిస్తారు.కాబట్టి పంచముఖి హనుమంతుడి చిత్రాన్ని పూజ గదిలో ఉంచకూడదు.

ఒకానొక సమయంలో తల్లి సీత అతని చిన్న రూపమును చూసి ఇంత చిన్న కోతి తనకు ఎలా సహాయం చేస్తుంది అని ఆలోచిస్తుంది.అప్పుడు హనుమంతుడు తన మహా విశాల రుద్ర రూపంలో కనిపిస్తాడు.ఈ ఫోటో కూడా ఇంట్లో ఉంచకూడదు.ఇంకా చెప్పాలంటే పూజ గృహంలో లేదా మరి ఇతర గదిలో హనుమాన్ లంకను దహనం చేస్తున్న ఫోటోను ఉంచకూడదు.దహనం చేసిన ఆ రూపంలో హనుమంతుడు పూజించబడడు.అలాగే హనుమంతుడు సంజీవని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు కాలనేమీ అతని దారిని అడ్డుకుంటాడు.
ఆ తర్వాత కాలనేమి సన్యాసి వేషంలో సరస్సులో స్నానం చేయమని అడిగాడు.హనుమాన్ ని చంపాలని కోరుకునే ఒక ఆడ ముసలి( Crocodile ) నీటిలో నివసిస్తూ ఉంటుంది.
హనుమంతుడు ఒక్క తన్నుతో ఆ ముసలిని చంపేస్తాడు.ఈ సంఘటనకు సంబంధించిన హనుమంతుని ఫోటోను ఇంట్లో ఉంచకూడదు.