దసరా అయినా 5 రోజుల తర్వాత రావణుని దహనం ఎక్కడంటే..

మనదేశంలో దసరా పండగ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి విజయదశమి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

 Even If It Is Dussehra, After 5 Days Ravana Will Be Cremated ,  Ravana, Lanka, D-TeluguStop.com

రావణాసుడి దహన కార్యక్రమాన్ని కూడా చేస్తారు.అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కానోజ్ జిల్లాలో దసరా రోజు వేడుకలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి.

ఎందుకంటే లంకాధిపతి రావణుడి విగ్రహాన్ని దహన కార్యక్రమం దసరా పండుగ అయిపోయిన తర్వాత చేస్తారు.అయితే ఈ సంప్రదాయం దాదాపు 200 సంవత్సరాలుగా అక్కడి స్థానికులు పాటిస్తున్నారట.

అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం లంకాధిపతి రావణుడు దసరా రోజున తన ప్రాణాలను విడిచిపెట్టలేదు.దసరా పండుగ తర్వాత వచ్చే శరత్ పౌర్ణమి రోజున రావణుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు.

అందువల్ల అక్కడి ప్రజలు 200 సంవత్సరాలకు పైగా దసరా పండుగ 5వ రోజున శరత్ పౌర్ణమి నాడు రావణుడి దహన కార్యక్రమం చేస్తారు.పురాణ గ్రంధాల ప్రకారం శ్రీరాముడు, లంక అధిపతి రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు విభీషణుడి ఆదేశం ప్రకారం మేరకు శ్రీరాముడు, రావణుడి నాభి పై బాణం వెయ్యగా అతని నాభి నుండి అమృతం వస్తుంది.

ఆ తరువాత సుమారు ఐదు రోజులపాటు రావణుడు ప్రాణం విడిచిపెట్టలేదు.రాముడి బాణం తగిలిన తర్వాత రావణుడు ఆకాశం నుండి స్పృహ కోల్పోయి నేలపై పడినప్పుడు, శ్రీరాముడు తన తమ్ముడు అయిన లక్ష్మణుడితో రావణుడు గొప్ప జ్ఞాని నీవు వెళ్లి అతని నుండి జ్ఞానాన్ని తీసుకో అని చెబుతాడు.

అప్పుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు రావణుని జ్ఞానం పొందడానికి ఐదు రోజుల సమయం పడుతుంది.ఐదు రోజుల తర్వాత రావణుడు శ్రీరాముడి పేరు తలుచుకుంటే తన ప్రాణాలను విడిచిపెడతాడు.ఈ కానోజ్ జిల్లాలో రావణుడి దహన కార్యక్రమం దసరా పండుగ జరిగిన తర్వాత శరత్ పౌర్ణమి రోజున చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube