టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన.. దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy )ని దర్శించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.అలాంటి వారికి ఇది శుభవార్త అని కచ్చితంగా చెప్పవచ్చు.

 When Will The Darshan Tickets For Various Ttd Services Be Released , Darshan Tic-TeluguStop.com

ఎందుకంటే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.భక్తుల సౌకర్యం కోసం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను నవంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేసిందని దేవాలయం ముఖ్య అధికారులు వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Darshan Ticket, Devotional, Ratha Saptami, Srivenkateswar

అంతే కాకుండా తిరుమల తిరుపతిలోని గదుల కోటాను నవంబర్ 24వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారని వెల్లడించారు.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో ముందుగా దర్శన టికెట్ల గదులను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.ఇలా గదుల స్లాట్స్ బుక్ చేసుకోవడం వల్ల భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా తక్కువ సమయంలోనే స్వామి వారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.అంతే కాకుండా 2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి( Ratha saptami ) పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను నవంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ లో విడుదల చేయనుందని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Darshan Ticket, Devotional, Ratha Saptami, Srivenkateswar

ఇంకా చెప్పాలంటే 18 నుంచి 50 సంవత్సరాల వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్టాట్లను బుక్ చేసుకోనందుకు అర్హులు అని వెల్లడించారు.భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి,ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ లను నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు.అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పరకామణి సేవకులను టీటీడీ( TTD ) విడుదల చేయనుంది.ఈ సేవలను www.tirumala.org వెబ్సైట్ లో భక్తులు బుక్ చేసుకోవచ్చని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube