ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5:50సూర్యాస్తమయం: సాయంత్రం 6:06రాహుకాలం: సా.12.00 నుంచి 1.30 వరకుఅమృత ఘడియలు: రా.5.56 నుంచి 7.41 వరకుదుర్ముహూర్తం: సా.11.33 నుంచి 12.22 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rashi Phalalu):
మేషం:
ఇతరులతో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.ఆర్ధికంగా నష్టాలు రాకుండా చూసుకోండి.డబ్బును పొదుపుగా వాడుకోండి.మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.జాగ్రత్తగా ఉండండి.
వృషభం:
ఆర్ధికంగా నిలకడగా ఉంటారు.ఎవరికి అయినా గతంలో అప్పు ఇచ్చి ఉంటే ఈరోజు మీ ధనాన్ని మీరు తిరిగి పొందగలరు.విడిపోయిన బంధాలు, అనుబంధాలు పునరుద్ధిరించుకోవల్సిన రోజు.మీ జీవితం అర్ధవంతంగా ఉంటుంది.వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది.
మిథునం:
మీ బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.నగలపైన పొదుపు చేయడం మంచిది.
బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి.ఉద్యోగాల్లో కొన్ని చికాకులు తప్పవు.ఒత్తిడికి గురవుతారు ధ్యానం చేస్తే మంచిది.
కర్కాటకం:
ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా రోజును గడుపుతారు.ఆర్ధిక పరిస్థితి నీరసపరుస్తుంది.భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
సింహం:
మానసికంగా ప్రశాంతత నాశనం అవుతుంది.వత్తిడిని దాటడానికి కొన్ని వ్యాయామాలు చెయ్యడం మంచిది.ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి.వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.
కన్య:
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.మీ కుటుంబం కోసం కష్టపడి పని చేస్తే మంచి లాభాలు ఉంటాయి.ఆర్ధిక అభివృద్ధి కోసం కొన్ని మార్పులు చేస్తారు.అపార్ధాలు మాయం అవుతాయి.రోజంతా కొన్ని సమస్యలు వచ్చినప్పటికి సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తులా:
అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ధనలాభం ఉంటుంది.
సన్నిహితుల నుంచి వేడుకలకు ఆహ్వానాలు అందుతాయి.మీ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి.
మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి.వాటికి సిద్ధంగా ఉండండి.
వృశ్చికం:
ఇతరుల సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది.మీరు ఆఫీసులో కష్టపడి చేసిన పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది.
మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజు ఒకటిగా మారనుంది.
ధనస్సు:
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.అప్పుడే ఆనందంగా జీవిస్తారు.
ఈరోజు మీరు కొందరికి సహాయం చేసి మంచి పేరు సంపాదిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
మకరం:
కుటుంబసభ్యులతో ఎంతో సరదాగా ఉంటారు.పొదుపు చెయ్యడం మొదలు పెడుతారు.ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు.గతంలో ఎవరికో చేసిన సహాయంకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభం:
మీ సమయాన్ని అంత ఒకే పనిపై కేటాయించి వత్తిడి నుంచి బయటపడతారు.కొన్ని చెడు అలవాట్లపై డబ్బును పెడుతారు.స్నేహితులతో, కొత్తవారితో ఆనందంగా గడుపుతారు.భవిష్యత్తు కోసం కొన్ని డబ్బులు దాచుకుంటారు.
మీనం:
మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.కొందరు అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.ఇంటి అవసరాల కొరకు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది.ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.