కేఫ్ కాఫీ డే యజమాని తో తనను తాను పోల్చుకున్న లిక్కర్ కింగ్

కేఫ్ కాఫీ డే యజమాని వీసీ సిద్ధార్ధ తో లిక్కర్ కింగ్ యజమాని విజయ్ మాల్యా పీల్చుకున్నారు.సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్ధ తనను ఐటీ శాఖ వేధిస్తుంది అంటూ ఒక లేఖను రాసిన సంగతి తెలిసిందే.

 The Industrialist Vijaymalya Corners Government Agencies-TeluguStop.com

అయితే ఈ లేఖ విడుదల అయిన క్రమంలో మాల్యా స్పందిస్తూ సిద్దార్ధ లేఖ నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ప్రభుత్వ ఏజెన్సీలు,బ్యాంకులు ఎవరినైనా నిరాశలోకి నెట్టివేయగలవు అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.సరిగ్గా చెప్పాలి అంటే సిద్దార్ధ పరిస్థితి లాగానే నా పరిస్థితి ఉందంటూ మాల్యా పేర్కొన్నారు.

బకాయిలు తిరిగి చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ తన విషయంలో ప్రభుత్వ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందొ సిద్దార్ధ లేఖ చూసి అర్ధం చేసుకోవచ్చు అన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా అదే పాశ్చాత్య దేశాల్లో అయితే అప్పులను తిరిగి చెల్లించేందుకు సహాయం కూడా చేస్తారు అని,కానీ నా విషయంలో మాత్రం అప్పులు తిరిగి చెల్లించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.లిక్కర్ కింగ్ మాల్యా భారత్ తో ప్రభుత్వ బ్యాంకుల లో రూ.9000 కోట్ల మేరకు రుణాలను తీసుకొని వాటిని ఎగ్గొట్టి దేశం విడిచి లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తిరిగి మాల్యాను భారత్ కు రప్పించాలని భారత్ ప్రయత్నాలు కూడా చేస్తుంది.

కేఫ్ కాఫీ డే యజమాని తో తనను తా�

మరోపక్క సోమవారం రాత్రి నుంచి మిస్ అయిన సిద్దార్ధ నేత్రావతి నదిలో శవమై కనిపించిన విషయం విదితమే.గత రెండు రోజులుగా దాదాపు 150 మంది గజ ఈతగాళ్ల తో నేత్రావతి నదిలో గాలింపు చర్యలు చేపట్టగా చివరికి నదిలోనే సిద్దార్ధ మృతదేహం లభించడం తో కన్నడ నాట విషాదం అలుముకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube