సోషల్ మీడియా పుణ్యమా అంటూ నిత్యం రక రకాల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఏదో ఒక సరికొత్త ప్రయోగం చేసి నెటిజన్లను ఆకట్టుకోవాలని యువత తెగ ఉత్సహ పడుతుంది.
ఈ క్రమంలోనే ఎవరు చేయలేని, అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలని చూస్తున్నారు కొందరు యువత.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బైక్ పై, కార్లపై చేసే స్టంట్స్ చూస్తేంటే వామ్మో అనిపిస్తుంది.
వారు చేసే స్టంట్స్ చూసి జనాలు సైతం ఆశ్చర్య పోతున్నారు.సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అయి కూర్చుంది.
అతను బైక్స్ నడిపే విధానం చూస్తే ఎవరయినా సరే షాక్ అవ్వాలిసిందే.
ఎందు కంటే మీరు ఇప్పటి వరకు ఒక బైక్ మీదనే రకరకాల స్టంట్స్ చేసిన వారిని చూసి ఉంటారు.
కానీ ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు బైక్స్ ను నడపడం మీరు ఎప్పుడు చూసి ఉండరు.వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి కూడా ఒకేసారి రెండు బైక్స్ ను డ్రైవ్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచే సాడు.
మనం ఇప్పటి వరకు ఎంతోమంది హెవీ డ్రైవర్లను చూసి ఉంటాము.కానీ ఈ వ్యక్తి చేసిన విన్యాసానికి ఇతనికి ఏ పేరు పెట్టాలో అర్ధం కావడం లేదు అనే చెప్పవచ్చు.
ఈ వ్యక్తి ఒకేసారి రెండు మోటార్ సైకిళ్లను కిక్కిరిసిన హైవేపై డ్రైవ్ చేసాడు.
అసలు భయపడ కుండా చాలా కూల్ గా రెండు మోటార్ సైకిళ్లను రద్దిగా ఉండే రోడ్డుపై అతి సులబంగా నడిపాడు.

రోడ్డుపై ట్రక్కులు, బైక్‌లు, కార్లు వంటి వాహనాలతో బిజీగా ఉన్నగాని లెక్కచేయకుండా, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఇలా రెండు బైక్‌లను ఎకకాలంలో నడిపి అందరికి షాక్ ఇచ్చాడు.పైగా అతని తలకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అంటే అతని ధైర్యాన్ని మేచ్చుకోవాలో లేక అతని ఓవర్ కాన్ఫిండెన్స్ చూసి నవ్వాలో అర్ధం.కావడం లేదు.ఎందుకంటే బైక్స్ నడిపే క్రమంలో ఏ విధమైన ప్రమాదం జరిగినా కానీ అతని ప్రాణాలు సైతం గాల్లో ఎగిరిపోతాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియోకు నెటిజన్లు సైతం విపరీతమైన లైకులు, కామెంట్లు పెడుతున్నారు.
ఇతను మాములు డ్రైవర్ కాదు రోబో డ్రైవర్ లాగా ఉన్నాడని ఒకరు అంటే ఇతనికి తప్పకుండా హెవీ డ్రైవర్ అవార్డు ఇవ్వాలని మరొక నేటిజన్ కామెంట్ చేస్తున్నారు.







