ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో అధిక బరువు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంది.చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది ప్రజలు జీవనశైలి మారడం, అంతేకాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంది.ఇంకా చెప్పాలంటే అధిక బరువును తగ్గడానికి చాలామంది ప్రజలు రకరకాల వ్యాయామాలు, డైట్ ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే మార్కెట్లో దొరికే స్లిమ్మింగ్ బెల్టును చాలామంది ప్రజలు ఉపయోగిస్తున్నారు.ఇవి ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య, నడుము చుట్టూ, పొత్తి కడుపు దగ్గర ఉన్న అధిక కొవ్వు కరుగుతుందని చాలామంది ప్రజలు ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ నిండా రకరకాల స్లిమ్మింగ్ బెల్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ స్లిమ్మింగ్ నడుముకు ధరిస్తే అది కేవలం శరీరం మీద మాత్రమే తన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ నడుముకు ఏ వస్తువునైనా సరే బిగించి కట్టుకుంటే సహజంగానే పొత్తికడుపు మీద చెమట వస్తూ ఉంటుంది.ఇది కేవలం శరీరంలో అధికంగా ఉన్న నీటిని కాస్త తగ్గిస్తుంది.
బెల్టు ధరించినప్పుడు కరిగేది కొవ్వు కాదు కేవలం శరీరంలోని అదనపు నీరు కాస్త బయటకు వెళ్ళిపోతుంది.అందువల్ల అప్పటికప్పుడు కాస్త సన్నబడినట్లు కనిపించవచ్చు కానీ మీరు మళ్ళీ నీళ్లు తాగి శరీరాన్ని డిహైడ్రేట్ చేసినప్పుడు తిరిగి పొట్ట యధాస్థితికి వస్తుంది.

స్లిమ్మింగ్ బెల్ట్ ధరిస్తే నడుము దగ్గర కొవ్వు తగ్గిపోతుంది అని చాలామంది నమ్ముతారు.కానీ అలా కొవ్వు తగ్గడం అస్సలు సాధ్యం కాదు.శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నెమ్మదిగా వర్కౌట్ ద్వారా మాత్రమే కరిగేందుకు అవకాశం ఉంది.కూర్చున్న చోట కొవ్వు కరగడం సాధ్యం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి.అలాంటిది ఎవరైనా ప్రచారం చేస్తుంటే అది మార్కెటింగ్ మాయాజాలం అని తెలుసుకోవడం ఎంతో మంచిది.వేళకు తినడం, సరైన సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, తగినంత వ్యాయామం చేయడం వల్ల అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు.