Ayesha Shiva: బిజినెస్‌మేన్‌ లో కాజల్ స్నేహితురాలిగా కనిపించిన నటి ఇప్పుడు ఎంత మారిపోయిందో చూశారా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆయన నటించిన, పూరి జగనాథ్ దర్శకత్వం వహించిన ‘బిజినెస్‌మేన్‌’ మూవీ( Businessman Movie ) ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

 Do You Know About Mahesh Babu Business Man Actress Ayesha Shiva-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు 9న రీ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మహేష్ బాబు ని డిఫరెంట్ గా చూపించాడు పూరి జగనాథ్.

( Puri Jagannadh ) ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటించింది.కాజల్ అగర్వాల్ కి ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి ఎవరు? ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Actressayesha, Ayesha Shiva, Businessman, Kajal, Kajal Aggarwal, Kajalagg

మహేష్ నటించిన ‘పోకిరి’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పూరి జగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్‌మేన్‌’ సినిమా మహేష్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించింది.ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ స్టైల్ లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఆడియన్స్ ని చాలా ఆకట్టుకున్నాయి.అయితే గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా గా ఆగష్టు 9న ‘ పోకిరి ‘( Pokiri ) సినిమా ని రీ రిలీజ్ చేసారు.పోకిరి సినిమాతో లాస్ట్ ఇయర్ నుంచి మొదలయిన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈసారి మహేష్ బాబు బర్త్‌డేకి( Mahesh Babu Birthday ) ‘ బిజినెస్ మెన్ ‘సినిమా ని రీ రిలీజ్ చేశారు.ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ద్వారానే రూ.1.36 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.బిజినెస్‌మేన్ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రేంజ్ లో వసూలు కావడం గమనార్హం.

Telugu Actressayesha, Ayesha Shiva, Businessman, Kajal, Kajal Aggarwal, Kajalagg

ఇదిలా ఉండగా ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి పేరు ఆయేషా శివ.( Ayesha Shiva ) ఈ అమ్మడు కెనడాలో నటించిన భారతీయ నటి.బిజినెస్‌మేన్‌ సినిమా లో ఈ అమ్మడు తన డైలాగ్స్ తో అదరగొట్టేసిందనే చెప్పాలి.ఆయేషా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.బాలీవుడ్ సినిమాలలో ఆమె నటన చూసి ఫిదా అయిన పూరి జగనాథ్ ఆయేషాని బిజినెస్ మేన్ సినిమా కాజల్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసాడట.

ఈ సినిమా తరువాత ఈ అమ్మడు మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు.అయితే రీసెంట్ గా ఆయేషాకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

వాటిని చూసి ఈ అమ్మడు చాలా మారిపోయిందని టాలీవుడ్ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube