శీతాకాలం స్టాట్ అయిపోయింది.చలి పులి ప్రజలను వణికిస్తోంది.
ఈ చలి కాలంలో దాదాపు అందరూ ఎదుర్కొనే కామన్ సమస్య.డ్రై స్కిన్ లేదా పొడి చర్మం.
ఈ సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి చర్మం పొడిబారిపోతుంటుంది.ముఖ్యంగా ముఖం చాలా డ్రైగా అయిపోతుంటుంది.
చలి, పొడి గాలులు వల్ల అలా మారుతుంటుంది.ఇక ఈ డ్రై స్కిన్ నుంచి బయటపడాలని మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీములు వాడుతుంటారు.
కానీ, వాటి వల్ల తగిన ఫలితం లేక బాధపడుతుంటారు.
అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.
డ్రై స్కిన్‌ను స్మూత్‌గా మార్చుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్‌లో పాలు వేసి.అందులో నిమ్మ రసం యాడ్ చేయాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.బాగా ఆరనిచ్చి నీటితో క్లాన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల డ్రై స్కిన్ కాస్త పోయి.స్మూత్ గా మారుతుంది.
రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ మరియు కొకొనట్ ఆయిల్ ఈక్వల్‌గా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి నాలుగు సార్లు చేయడం ముఖం నున్నగా మారుతుంది.
మూడొవది.ఒక బౌల్‌లో బొప్పాయి గుజ్జు, అరటి గుజ్జు, పెరుగు మరియు తేనె వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది.అలాగే ఈ ప్యాక్ వల్ల ముఖం పై ఉన్న మచ్చలు పోయి కాంతివంతంగా మారుతుంది.