రాత్రుళ్లు గాఢంగా నిద్ర ప‌ట్టాలా..? అయితే ఇవి ట్రై చేయండి!

నిద్ర‌.ఆరోగ్యానికి కాపాడే ఓ ర‌క్ష‌ణ క‌వ‌చం అన‌డంలో సందేహ‌మే లేదు.

 Do You Sleep Deeply At Night However Please Try These! Sleep Deeply, Deep Sleep,-TeluguStop.com

స‌రైన నిద్ర లేన‌ప్పుడు మెద‌డు, శ‌రీరం రెండు తీవ్రంగా అల‌సిపోతాయి.అందుకే రోజుకు పిల్ల‌లైతే ప‌ది గంట‌లు, పెద్ద‌లైతే ఏడు గంట‌లు ఖ‌చ్చితంగా నిద్ర పోవాల‌ని.

అప్పుడే ఆరోగ్యంగా జీవిస్తార‌ని అంటుంటారు ఆరోగ్య నిపుణులు.అయితే చాలా మంది రాత్రుళ్లు గాఢంగా నిద్ర పోవాల‌ని తెగ ఆశ ప‌డుతుంటారు.

కానీ, నేటి టెక్నాల‌జీ యుగంలో అటు వంటి వరం చాలా అంటే చాలా త‌క్కువ మందికే ఉంటుంది.

మ‌రి ఆ లిస్ట్ మీరూ ఉండాల‌నుకుంటారా.? మీకూ రాత్రుళ్లు గాఢంగా నిద్ర ప‌ట్టాలా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్స్‌ను ట్రై చేయాల్సిందే.ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

అశ్వగంధ.

ఈ పేరు వినే ఉంటారు.ఆయుర్వేదంలో ఆశ్వ‌గంధ పొడిని విరి విరిగా ఉప‌యోగిస్తాయి.

అయితే ఎవ‌రైతే త్వ‌ర‌గా, గాఢంగా నిద్ర ప‌ట్టాల‌ని కోరుకుంటున్నారో వారు ప‌డుకోవ‌డానికి గంట లేదా అర గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌టి పాల‌ల్లో కొద్దిగా ఆశ్వ‌గంధ పొడిని క‌లిపి సేవిస్తే.ఇక కుంభ కర్ణుడిలా నిద్ర పోవ‌డం ఖాయం.

అలాగే చామంతి టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.మ‌రియు మంచి నిద్రను అందించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది.ఒకే ఒక్క క‌ప్పు చామంతి టీ తాగారంటే.ఒత్తిడి, ఆందోళ‌న‌, భ‌యాలు దూర‌మై గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.నిద్ర లేమి స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారికి సైతం చామంతి టీ బెస్ట్ ఆప్ష‌న్‌.

ఇక బాదం సైతం స్లీపింగ్ స‌మ‌స్య‌ల‌ను నివారించి.సుఖ నిద్ర‌ను అందించ‌గ‌ల‌దు.ప‌డుకోవ‌డానికి గంట ముందు ఒక గ్లాస్ పాల‌ల్లో స్పూన్ బాదం పౌడ‌ర్ లేదా ఆల్మండ్ బటర్‌ను యాడ్ చేసి తీసుకుంటే ఇట్టే నిద్ర ప‌ట్టేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube