బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ( Katrina Kaif )గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కత్రినా కైఫ్.
కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.
కత్రినా కైఫ్ తో పాటు కలిసి నటించిన చాలామంది హీరోయిన్లు తల్లులు అయిన విషయం తెలిసిందే.హీరోయిన్ గా నటించడంతో పాటు పెళ్లిళ్లు చేసుకొని తల్లులు అయ్యి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.
కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.కత్రినా కైఫ్ కూడా తల్లయితే చూడాలనుకుంటున్నట్టు చాలామంది పోస్టులు పెట్టడం విడ్డూరం.

విక్కీ కౌశల్ ( Vicky Kaushal )ను పెళ్లాడి చాలా ఏళ్లయిందని, వెంటనే ఆ తీపి కబురు కూడా అందించాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.అయితే పెళ్లి పిల్లలు అన్నది పూర్తిగా వ్యక్తిగతం అన్న విషయం తెలిసిందే.మొన్నటివరకు పెళ్లి చేసుకోలేదంటూ ఆమెపై పోస్టులు పెట్టారు.ఇప్పుడు పెళ్లి అయిపోవడంతో పిల్లల్ని కనమంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.అయితే సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలవ్వడానికి కారణం సల్మాన్ ఖాన్( Salman Khan ).కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ తో మరోసారి నటిస్తారా అనే ప్రశ్నపై స్పందిస్తూ.ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైందని, పిల్లలు పుడితే చూడాలని ఉందంటూ కామెంట్ చేశాడు.

ఇక సల్మాన్ ఖాన్ ఆ విధంగా కామెంట్ చేయడంతో అప్పటినుంచి కత్రినా కైఫ్ పిల్లల విషయం గురించి తల్లి అవడం విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.త్వరగా గర్భం దాల్చి వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమెకు సోషల్ మీడియాలో ఉచిత సలహాలిస్తున్నారు చాలామంది.ప్రస్తుతం కత్రినాకైఫ్ వయసు 41 సంవత్సరాలు.
మరి ఈ విషయం గురించి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.