ప్రభుదేవా ఎంత పెద్ద గొప్ప నటుడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రభుదేవా గురించి తెలియని వారు ఎవరు ఉండరు.
ఒక నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా అందరికి సుపరిచితుడే.ఇన్ని టాలెంట్లు ఒక మనిషిలో ఉండడం చాలా అరుదు.
ఒకానొక సమయంలో అనుకోకుండా టైం బాగుండి, అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే ఒక పెద్ద స్టార్ హీరో అయిపోయాడు ప్రభుదేవా.అయితే హీరో అయ్యాక, ఒక స్టార్ అనే గుర్తింపు వచ్చాక, తన భార్య గురించి ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో తన పెళ్లి చేసుకున్న భార్యను కూడా బయటి ప్రపంచానికి చూపించలేకపోయాడు ప్రభుదేవా.
అభిమానుల్లో తనకున్న క్రేజ్ ఏమవుతుందోనన్న భయంతో తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను దాచేసి, దొంగతనంగా ఆమెతో కొన్నాళ్లపాటు సంసారం చేశాడు ప్రభుదేవా.ఇంకా తన భార్యను ఎవ్వరికీ కనపడకుండా దాచేసాడు మన ఇండియన్ ప్రముఖ డాన్సర్.
ప్రభుదేవా అతి చిన్న వయసులోనే కొరియోగ్రాఫర్ అయిపోయాడు.ప్రభుదేవా డాన్స్ చూసి యావత్ భారతదేశము నోరెళ్ళబెట్టినది.
అయితే ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా చేసే సమయంలో ఒక డాన్సర్ తో ప్రేమలో పడ్డాడు ఆ డాన్సర్ మరెవరో కాదు రామలత.దాంతో వాళ్లు ఇద్దరూ 19 ఏళ్లకే సహజీవనం మొదలు పెట్టేశారు.
ఆ తర్వాత ప్రభుదేవా టాలెంట్ చూసి డైరెక్టర్ శంకర్ జెంటిల్ మాన్ సినిమాలో చికుబుకు రైలే.అనే పాటకు డాన్స్ చేపించాడు.ఇంకేముంది రాత్రికి రాత్రే యావత్ భారతదేశం తన ఏంటో గుర్తించే లాగా డాన్స్ చేశాడు.రాత్రికి రాత్రి ఒక పెద్ద స్టార్ గా మారిపోయాడు ప్రభుదేవా.
ఈ సినిమా తర్వాత కొందరు ప్రభుదేవా క్రేజ్ ని గుర్తించి కొంత మంది తమిళ నిర్మాతలు ప్రభుదేవా ని హీరోగా పెట్టి ఇందు అనే సినిమాని తీశారు.ఈ సినిమాలో ప్రభుదేవా కు జోడీగా రోజా నటించారు.
అయితే ఆ సినిమా ప్లాప్ అయింది.తర్వాత ప్రభుదేవా మరికొన్ని సినిమాలు తీశాడు.
కానీ, ఆ సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి.మళ్లీ ప్రభుదేవాకి ఒక విధంగా చెప్పాలంటే శంకర్ మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చాడని చెప్పవచ్చు.
ఎందుకంటే ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాని హీరోగా పెట్టి సినిమా తీశాడు.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆ సినిమా విజయవంతం అయిన తర్వాత ప్రభుదేవా కి ఎక్కడలేని ఫ్యాన్స్ అందరు పుట్టుకొచ్చారు మరీ ముఖ్యంగా అమ్మాయిలు కూడా ప్రభుదేవాకి పెద్ద అభిమానులుగా తయారయ్యారు.

ఇవన్నీ చూసిన రమలత ప్రభుదేవా తనను పట్టించుకోవడం లేదని, అమ్మాయిల వెంట తిరుగుతున్నాడు అనే అనుమానంతో అప్పటికప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవాని పట్టుబట్టింది.ఇంక చేసేదేమీలేక ప్రభుదేవా రమలతని దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు.తన 22 సంవత్సరాలకే రమలత తో వివాహం జరిగిపోయింది ప్రభుదేవాకి.
రమలతను ప్రేమించి 1995 లో పెళ్లి చేసుకున్నాడు.రానురాను సినీ ఇండస్ట్రీలో ప్రభుదేవాకి క్రెజ్ అనేది పెరిగిపోతుంది.
అయితే, ప్రభుదేవా పెళ్లి విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి మీడియా వరకు వెళ్ళింది.మీడియా వారు ఊరుకుంటారా.? ప్రభుదేవా రమలత వివాహం గురించి టీవీ, పేపర్స్ లో హెడ్ లైన్స్ లో వేసి ప్రచారం చేసారు.ప్రభుదేవా ఈ విషయాన్ని నిరూపించుకోవటానికి నాకు, ఆమెకు ఎటువంటి సంబంధం లేదు.

తాను ఒక ముస్లిం మహిళ ఆవిడతో నాకు ఎటువంటి వివాహిత సంబంధము లేదు.నాకు రమలత ఒక మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు.తను నాకు ఒక డాన్సర్ గా పరిచయం మాత్రమే అంతే కానీ తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు.ప్రభుదేవా ఎంత చెప్పినా గానీ మీడియా నమ్మలేదు.
రమలత ఫోటో ని తీసుకువచ్చి ఈవిడే ప్రభుదేవా భార్య అని పేపర్లో న్యూస్ ను ప్రకటించింది.అయితే ఈ న్యూస్ చుసిన ప్రభుదేవాకి ఒళ్ళు మండిపోయి మీడియా ముందు ప్రూవ్ చేయాలని చెప్పి తన భార్యను రాత్రికి రాత్రే డైరెక్టర్ పి.వాసు వాళ్ళ ఇంట్లో దాచేసి తన ఇల్లు సోదా చేసుకోండి అని మీడియా వాళ్లకి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు.మీడియా వాళ్లకి ఎన్ని ప్రుపులు చూపించిన కానీ వాళ్ళు నమ్మలేదు.
నా అన్నయ్య కి ఇంకా ఇప్పటిదాకా పెళ్లి కాలేదు అలాంటిది అన్న కి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని మీడియా వాళ్ల మీద ఎదురుదాడికి దిగాడు ప్రభుదేవా.

అయితే, మీడియాలో ఈ గొడవంతా తగ్గాక అలాగే కొన్ని రోజులకు ఇండస్ట్రీలో తన క్రెజ్ పూర్తిగా తగ్గాక రమలత ను హిందూ మతంలోకి మార్చి మరి పెళ్లి చేసుకున్నాడు.ఆ తర్వాత ప్రభుదేవా హవా కొంచెం తగ్గింది.మళ్ళీ కొరియోగ్రాఫర్ గానే కొన్నాళ్లపాటు కొనసాగాడు.
ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు.వీళ్ళకి ముగ్గురు పిల్లలు.
అందులో ఒక బాబు క్యాన్సర్ తో చనిపోయాడు.మళ్ళీ 15 ఏళ్ళ సంసారం తరువాత ప్రభుదేవా మళ్ళీ ప్రేమలో పడ్డాడు.
ఎవరితో అనుకుంటున్నారు హీరోయిన్ నయనతారతో.పెళ్లి అయ్యి, పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయాడు ప్రభుదేవా.ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విచ్చలవిడిగా తిరిగేశారు కూడా.ఇవన్నీ తేలిసిన ప్రభుదేవా భార్య రమలత ఎంత మాత్రం పడనివ్వలేదు.నానా గొడవ చేసి మీడియాలో ఇద్దరి పరువు తీసేసింది.ఇదండీ ప్రభుదేవా పెళ్లి గోల.