దేవర సీక్వెల్ గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అలా చెప్పడంతో?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ లో తెరరకెక్కిన సినిమా దేవర.( Devara ) భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.అలాగే బాగానే కలెక్షన్లను సాధించింది.డివైడె టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం రఫ్ఫాడించింది అని చెప్పాలి.ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ సైతం బ్రేక్ చేశారు.ఇటీవల ఈ సినిమానే జపాన్ లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

 Jr Ntr Teases Whats In Store For Devara 2 Details, Jr Ntr, Devara 2, Tollywood,-TeluguStop.com
Telugu Devara, Japan, Jr Ntr, Ntr, Koratala Siva, Ntr Devara, Tollywood-Movie

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది.మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా జపాన్ లో ఉన్న ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్కు చేరుకున్నారు.అయితే ఎన్టీఆర్ అక్కడ జపాన్ మీడియాలో దేవర 2( Devara 2 ) పై ఇచ్చిన అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.తాను దేవర 2 కోసం మాట్లాడుతూ ఇపుడు దేవర 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది.

దేవర 1 కన్నా పార్ట్ 2 లో చాలా పెద్ద కథ, పార్ట్ 1 లో దేవర కోసం చాలా నేర్చుకున్నారు.

Telugu Devara, Japan, Jr Ntr, Ntr, Koratala Siva, Ntr Devara, Tollywood-Movie

దేవర 1 లో వర గురించి పెద్దగా రివీల్ అవ్వదు, దేవర పార్ట్ 2లో మాత్రం వర కోసం ఎక్కువ తెలుసుకుంటారు.అంతేకాకుండా అసలు దేవర కి ఏమైంది, అనే బ్యాక్ స్టోరీకి సమాధానం దేవర 2 లో దొరుకుతుంది అంటూ ఎన్టీఆర్ దేవర 2పై ఇచ్చిన బిగ్ అప్ డేట్ పై ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.దీన్నిబట్టి చూస్తే దేవర పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుంటుందని తెలుస్తోంది.

ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.మరి దేవర 2 ని ఎప్పుడు మొదలుపెడతారు చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube