మీల్ మేకర్ ఎలా త‌యార‌వుతుంది.. అవి ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?

మీల్ మేక‌ర్( Meal Maker ) చాలా మందికి మోస్ట్ ఫేవరెట్‌.మీల్ మేక‌ర్ తో క‌ర్రీస్‌, ఫ్రైస్ ఎక్కువ‌గా చేస్తారు.

 Health Benefits Of Eating Meal Maker! Health, Health Tips, Good Health, Meal Mak-TeluguStop.com

బిర్యానీల్లో కూడా ఉప‌యోగిస్తుంటారు.మాంసాహారం తిన‌ని వారికి మీల్ మేక‌ర్ మంచి ప్రోటీన్ ఆల్టర్నేటివ్.

అయితే అస‌లు మీల్ మేకర్ ఎలా త‌యార‌వుతుంది.? అవి ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేకర్ ను సోయా చంక్స్( Soy Chunks ) అని కూడా పిలుస్తారు.సోయా బీన్స్ నుంచి మీల్ మేక‌ర్ త‌యార‌వుతుంది.ఆరోగ్య‌ప‌రంగా మీల్ మేక‌ర్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.మీల్ మేకర్ లో ఉన్న ప్రోటీన్ చాల బలమైనది.

నాన్-వెజ్ తినని వారు మీల్ మేక‌ర్ ను తీసుకుంటే ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.మీల్ మేక‌ర్ లో తక్కువ ఫ్యాట్, తక్కువ కేలరీలు.

ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి.అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఇవి మంచి ఆహారం అవుతుంది.

అలాగే ఐరన్ మరియు క్యాల్షియం ( Iron and calcium )మెండుగా నిండి ఉండ‌టం వ‌ల్ల మీల్ మేక‌ర్ రక్తహీనత నివారించడానికి, ఎముకల ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డ‌తాయి.డయాబెటిస్ ఉన్నవారికి మీల్ మేక‌ర్ సపోర్టివ్ ఫుడ్ అవుతుంది.

ఎందుకంటే, హై ఫైబర్ కంటెంట్ క‌లిగి ఉండ‌టం వల్ల మీల్ మేక‌ర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ని ఒకేసారి కాకుండా మెల్లగా పెంచుతుంది.

Telugu Benefitsmeal, Tips, Latest, Meal Maker, Mealmaker-Telugu Health

3223.

మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు మీల్ మేక‌ర్ ను తీసుకుంటే ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌తారు.అంతేకాకుండా సోయాలో ఉండే ఫైటోఎస్ట్రోజెన్స్ కొంత మందికి హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి, ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ సమయంలో మీల్ మేక‌ర్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచిదే, కానీ మితంగా తీసుకోవాలి.సహజమైన ఇతర ఆహారాలతో పాటు వాడుకుని తింటే ఇంకా మంచిది.అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.సోయా అల‌ర్జీ ఉన్న‌వారు కూడా మీల్ మేక‌ర్ జోలికి వెళ్ల‌కూడ‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube