రీరిలీజ్ అవుతున్న ప్రభాస్ బాహుబలి.. ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఒకప్పుడు విడుదల అయిన సినిమాలను థియేటర్లలో మళ్లీ రీ రీలీజ్ చేస్తున్నారు.

 Baahubali Re Release On October Details, Baahubali, Re Release, Tollywood, Octob-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించాయి.రీ రిలీజ్ లో కూడా ఎన్నో సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాదించాయి.

అయితే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది.ఆ సినిమా మరేదో కాదు బాహుబలి.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం బాహుబ‌లి.( Baahubali ) ఈ సినిమా త‌ర్వాత టాలీవుడ్ సినిమా స్థాయిని మార్చేసింది.

భారీ బ‌డ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా భారీ విజయం సాధించాల్సిందే.

Telugu Baahubali, Rajamouli, October, Prabhas, Tollywood-Movie

బాహుబ‌లి చిత్రం రెండు పార్ట్‌ లుగా విడుద‌లై క‌నీవిని రికార్డులని సాధించింది.తొలి పార్ట్ క‌న్నా కూడా రెండో పార్ట్ సినీ ప్రియుల‌లో ఎంతో ఆస‌క్తిని క‌లిగించింది.క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే స‌స్పెన్స్ తో బాహుబ‌లి రెండో పార్ట్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది అని చెప్పాలి.

భారీ అంచనాల నడుమ అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఒక సునామీని సృష్టించింది.బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి,( Rajamouli ) హీరో ప్ర‌భాస్‌లకే( Prabhas ) కాదు అందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికి కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ల‌భించాయి.

టీవీ టెలికాస్ట్ లో కూడా బాహుబలి చిత్రం ఒక ప్రభంజనం సృష్టించింది.

Telugu Baahubali, Rajamouli, October, Prabhas, Tollywood-Movie

అలాంటి చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.ఈ సినిమా విడుదలై అక్టోబర్ నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తి కానున్న‌ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో రీరిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు.అక్టోబ‌ర్ అంటూ రిలీజ్‌ కి ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉంది.

ఇంత త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న చేశారంటే మూవీ ప్ర‌మోష‌న్స్ ఒక రేంజ్‌లో చేయ‌బోతున్నార‌ని అర్ధ‌మ‌వుతుంది.రీరిలీజ్‌ లో కూడా బాహుబ‌లి చిత్రం రికార్డులు సాధించేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్ప‌టి వ‌ర‌కు రీ రిలీజ్ చరిత్ర లో 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం నెంబర్ 1 చిత్రం గా విజయ్ గిల్లీ మూవీ.మ‌రి ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన బాహుబలి మూవీ రీ రిలీజ్ మూవీస్ లలో వంద కోట్ల గ్రాస్ ని రాబట్టిన చిత్రం గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి మరి.ఇదే జ‌రిగిందంటే రీరిలీజ్ మూవీస్‌ కి కూడా నాన్ బాహుబ‌లి రికార్డు అనే క్యాట‌గిరీ యాడ్ అవుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube