పడుకునే ముందు..లేచిన తర్వాత ఏ దేవుడిని స్మరించుకోవాలి... ఎందుకు స్మరించుకోవాలో తెలుసా?

సాధారణంగా మనం ప్రతి రోజు పడుకునే సమయంలో నిద్ర లేచే సమయంలో చాలామంది వారి ఇష్ట దైవాన్ని తలచుకుని పడుకోవడం లేదా ఉదయం లేచేటప్పుడు వారి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రలేవడం చేస్తుంటారు.అయితే నిద్ర పోయేటప్పుడు, నిద్ర లేచినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక దేవుడిని అయితే తలుచుకుంటారు.

 Remember These Gods While Sleeping And Waking Up Details,  Krishna, Night, Morni-TeluguStop.com

కానీ ఏ దేవుడిని తలచుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే…

ప్రతిరోజు మన నిద్రపోయే సమయంలో మనం తప్పనిసరిగా ఆ పరమశివుని స్మరించుకోవాలి.ఈ క్రమంలోనే నిద్రపోయే ముందు ఓం నమశ్శివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరించుకొని నిద్రపోవాలని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా పరమేశ్వరుడిని తలుచుకుని నిద్రపోవడం వల్ల మనకు కలలో ఏ విధమైనటువంటి పీడకలలు రావని నిద్రపోతున్న సమయంలో ఎలాంటి భయాందోళనలు ఉండవని సుఖంగా ప్రశాంతంగా నిద్ర వస్తుందని అందుకే నిద్ర పోయే ముందు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ నిద్ర పోవాలని పండితులు చెబుతున్నారు.

అలాగే ఉదయం నిద్ర లేచేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శ్రీమన్నారాయణుడిని తలచుకొని నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా విష్ణుమూర్తిని తలుచుకుని నిద్ర లేవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే….విష్ణువు అంటే స్థితి కారుడు.అందుకే ప్రతిరోజు ఉదయం అతని నామస్మరణ చేస్తూ నిద్రలేవడం వల్ల ఆ రోజు మొత్తం మనల్ని ఎంతో ఆనందంగా సంతోషంగా ముందుకు నడుపుతారు.ప్రతిరోజు ఆ నారాయణుడి మంత్రం జపిస్తూ నిద్రలేవడం వల్ల రోజంతా ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది.

ఇలా నిద్ర పోయేముందు పరమేశ్వరుడిని నిద్రలేచిన తర్వాత నారాయణుడిని స్మరించుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube