వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అని అంటారు....ఎందుకో తెలుసా?

తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో ఉన్న అని దేవాలయాలలో కెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో రెండో స్థానంలో ఉంది.ఏడుకొండల వాన్ని దర్శనం చేసుకుంటే పాపాలు,కష్టాలు,సమస్యలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

 Why Devotees Call Venkateswara Swamy As Vaddikasula Vadu Details, Devotees ,venk-TeluguStop.com

ప్రతి రోజు భక్తులు లక్షల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు.అదే బ్రహ్మోత్సవాలు, పర్వ దినాల్లో అయితే వచ్చే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతేకాక ఆయనకు ప్రతి రోజు ఆదాయం కోట్లలో వస్తుంది.వెంకటేశ్వర స్వామిని భక్తులు ఆప‌ద‌మొక్కుల వాడ‌ని, వ‌డ్డీ కాసుల వాడ‌ని పిలుస్తూ ఉంటారు.

కోరిన కోర్కెలను తీర్చి, ఆప‌ద‌ల నుంచి గ‌ట్టెక్కించి, అంతా మంచి జరిగేలా చేస్తారు కాబట్టి ఆప‌ద‌మొక్కుల వాడ‌ని పిలుస్తారు.అయితే మరి వ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒకానొక స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌ద్మావ‌తీ దేవిని పెళ్లి చేసుకోవ‌డానికి భూలోకం వ‌చ్చాడ‌ట‌.అయితే ల‌క్ష్మీ దేవిని వైకుంఠంలోనే వ‌దిలి రావ‌డంతో ఆయన ద‌గ్గ‌ర డ‌బ్బులు లేకుండా పోయాయి.

Telugu Devotees, Devotional, Kuber, Lakshmi Devi, Padmavathi Devi, Telugu Bhakth

దీనితో అయన వివాహానికి ఎక్కడ డబ్బు దొరకలేదు.ఆ సమయంలోనే కుబేరుడు వెంక‌టేశ్వ‌ర స్వామి వివాహానికి అయ్యే ధనాన్ని ఇచ్చాడట.వెంకటేశ్వర స్వామి సంవత్సరం లోపు అప్పు తీర్చేస్తానని కుబేరుడికి చెప్పారట.

కానీ వెంకటేశ్వర స్వామి సంవత్సరం అయ్యాక అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రమే ఇచ్చారట.అప్ప‌టి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వ‌డ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్త‌మే అవుతూ వ‌స్తుంద‌ట‌.అయినా స్వామి మాత్రం వ‌డ్డీనే క‌డుతూ వ‌స్తున్నాడ‌ట‌.

అందుకే ఆయ‌న‌కు వ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube