ఎలాంటి సినిమా కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది నేటితరం నటీనటులకు ఆదర్శంగా నిలిచిన “మెగాస్టార్ చిరంజీవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే అందులో సునాయాసంగా ఒదిగిపోయి ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో పెట్టింది పేరు.
అయితే అప్పట్లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.
అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
దీనికి తోడు ఈ చిత్రంలో మెగాస్టార్ లేడీ గెటప్ లో కనిపించడంతో ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లేడీ గెటప్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అంతేగాక ఈ ఫోటోలను షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షలసంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు మెగా స్టార్ చిరంజీవికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏమిటో అని.అయితే ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా పలు రికార్డులను కూడా నెలకొల్పి మెగాస్టార్ చిరంజీవి జీవితంలో చెరిగిపోని మైలు రాయిగా నిలిచి పోయింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 60 శాతం వరకూ పూర్తయినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.