టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు( Akkineni Naga Chaitanya ) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.తండేల్ సినిమాతో( Thandel ) చైతన్య కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అయితే తాజాగా నాగచైతన్య తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.శోభిత( Sobhita ) మన సంస్కృతి, సాంప్రదాయాలను ఫాలో అవుతుందని నాగచైతన్య అన్నారు.
మా వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతిదీ ఆమే డిజైన్ చేసిందని చైతన్య చెప్పుకొచ్చారు.కుటుంబంతో కలిసి ఆనందించిన క్షణాలు ఎప్పటికీ పదిలం అంటూ చైతన్య చెప్పుకొచ్చారు.తండేల్ గురించి చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా చాలా సహజంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చైతన్య కామెంట్లు చేశారు.

తండేల్ సినిమాలోని ప్రేమ కథ అద్భుతం అని నిజమైన ప్రేమలో బాధ ఉంటుందని ఆ పెయిన్ ను ఈ సినిమాలో మీరు చూడబోతున్నారని చైతన్య పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam District ) చెందిన కొందరు మత్స్యకారుల జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కిందని చైతన్య పేర్కొన్నారు.మేము శ్రీకాకుళం వెళ్లి అక్కడి వాళ్లను కలిసి కొన్ని విషయాలను తెలుసుకున్నామని చైతన్య చెప్పుకొచ్చారు.నా దృష్టిలో అక్కడి మత్స్యకారులే రియల్ హీరోలు అని చైతన్య వెల్లడించారు.

సాయిపల్లవిని( Sai Pallavi ) బుజ్జి అనే పేరుతో పిలుస్తానని శోభిత ముద్దు పేరు కూడా అదే కావడంతో ఆమె ఫీలైందని చైతన్య చెప్పుకొచ్చారు.చైతన్య చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఏపీలో 50 రూపాయల టికెట్ రేటు పెంపు కోసం మేకర్స్ ప్రయత్నించారని సమాచారం.ఆ రేంజ్ లో ఈ సినిమాకు పెంపు లభిస్తుందో లేదో చూడాలి.నాగచైతన్య తర్వాత సినిమాలతో రికార్డ్ స్థాయిలో హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటుండగా తండేల్ ఆ ఆశలను నెరవేరుస్తుందేమో చూడాల్సి ఉంది.