ఛీ, స్కూల్ పిల్లలతో పాడు పని చేయిస్తోంది.. ఆంధ్ర టీచరమ్మ వీడియో చూశారా?

తూర్పు గోదావరి జిల్లాలో( East Godavari ) ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్( Govt School Teacher ) చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆ టీచరమ్మ స్టూడెంట్స్‌తో తన కారు క్లీన్( Car Cleaning ) చేయించుకుంటూ కెమెరాకి చిక్కింది.

 Viral Video Andhra Teacher Forcing Students To Clean Car Details, Andhra Pradesh-TeluguStop.com

అలా వీడియో వైరల్( Viral Video ) కావడంతో ఇలా టీచర్ సస్పెండ్ అయింది.వివరాల్లోకి వెళ్తే, తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం దగ్గర వెంకటపురం అనే ఊర్లో ఉన్న ఓ స్కూల్లో ఈ సీన్ జరిగింది.

డి.సుశీల( D Susheela ) అనే టీచర్, ఇంగ్లీష్ టీచరట.స్కూల్ ఆవరణలోనే పిల్లలతో తన కారు తుడిపించుకుంది.చిన్న పిల్లలు కారు తుడుస్తుంటే, మేడమ్ గారు పక్కన నిల్చుని ఆర్డర్లు వేస్తున్నారు.

ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.ఇంకేముంది, నెటిజన్లు, పేరెంట్స్ అందరూ మండిపడ్డారు.

“చదువు చెప్పాల్సిన టీచర్, ఇలాంటి పనులు చేయిస్తోందా?” అంటూ దుమ్మెత్తి పోశారు.విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వరకు వెళ్లింది.వెంటనే రెస్పాండ్ అయ్యారు అధికారులు.తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సీరియస్ అయ్యారు.ఫిబ్రవరి 1న టీచర్‌ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.

టీచర్ సుశీల ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964ని బ్రేక్ చేశారని తేల్చారు.పిల్లలతో పర్సనల్ పనులు చేయించుకోవడం నేరం అన్నారు.ఇంక్వైరీ వేశారు, పూర్తి విచారణ జరిగే వరకు సస్పెన్షన్ వేటు తప్పదంటున్నారు.

ఇక అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSRCP ) కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యింది.“ఇదేం పాడు పని? స్కూల్లో పిల్లలతో కారు కడిగిస్తారా? చంద్రబాబు హయాంలో స్కూల్స్‌ని పట్టించుకోలేదు అన్నారు.ఇప్పుడు మీ హయాంలో ఇదేం సంస్కరణలు నారా లోకేష్ గారు?” అంటూ ట్విట్టర్‌లో నిలదీశారు.గతంలో టాయిలెట్స్ క్లీన్ చేయించిన ఘటనలు కూడా గుర్తు చేశారు.

ఇలాంటి ఘటనే తెలంగాణలో కూడా జరిగింది.

సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు టీచర్లు పిల్లలతో స్కూల్ గ్రౌండ్లో రాళ్లు ఏరిపించారు.ఆ వీడియో కూడా వైరల్ కావడంతో వాళ్లని కూడా సస్పెండ్ చేశారు.

టీచర్లు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు.పిల్లల్ని చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇలాంటి పనులు చేయించడం తప్పు అని అధికారులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube