సముద్రఖని( Samudrakani ) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం “శంభో శివ శంభో (2010)” ( Shambho Shiva Shambho )చాలామందిని ఆకట్టుకుంది.ఇందులో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణి, అభినయ, సూర్య తేజ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇది 2009లో వచ్చిన తమిళ మూవీ నాడోడిగల్‌కి రీమేక్.దాన్ని కూడా సముద్రఖని డైరెక్ట్ చేశాడు.
తెలుగు మూవీలో రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ ( Ravi Teja, Allari Naresh, Shiva Balaji )స్నేహితులుగా నటించారు.వాళ్లు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒక ప్రేమ జంటకు పెళ్లి చేసి విదేశాలకు పంపిస్తారు.
ఆ క్రమంలో ఒకరు కాలు పోగొట్టుకుంటే మరొకరు చెవిటి వాడవుతాడు.ఆ చెవిటివాడు అయ్యేది మరెవరో కాదు మన అల్లరి నరేష్.
ఈ సినిమాలోని ఒక సీన్‌లో కారులో ప్రేమ జంటను తీసుకెళ్తుండగా అల్లరి నరేష్ ఫుట్ బోర్డు పై నిలబడతాడు.ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు వారిని రౌడీలతో ఛేజ్ చేయిస్తారు.
ఒక రౌడీ ఒక కర్రదుంగతో అల్లరి నరేష్ చెవులపై బలంగా కొడతాడు.దాని ఫలితంగానే అతడికి చెవుడు వచ్చిందని, ఒక చెవిలో గుయ్ మని శబ్దం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని చూపించారు.
అయితే సినిమాలో మాత్రమే కాదు.ఈ సన్నివేశం చేశాక అల్లరి నరేష్ కి నిజంగానే అలాంటి ఒక బాధాకరమైన అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేశాడు.
భరణి అనే ఒక కొత్త చిన్న యాక్టర్ అల్లరి నరేష్ ని కొట్టాల్సి ఉంది.అయితే అది స్పాంజీ కర్ర కావడంతో అది సాగుతూ ఉండేది.అందుకే ఆ స్పాంజీ కర్రకు ఒక పీవీసీ పైపు తొడిగారు.ఆ పైపు కాస్త బలంగానే ఉంటుంది.దాంతోటే భరణి అల్లరి నరేష్ చెవులపై బలంగా కొట్టాడు.అంతే అది విరిగిపోయింది.
దిమ్మ తిరిగిపోయినట్లు నరేష్ ఒక రెండు నిమిషాల పాటు తనకి ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయాడు.
తర్వాత చూసుకుంటే కంటి నుంచి ముఖం చివరి దాక మొత్తం వాచి పోయి కనిపించింది.ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ తెలిపాడు.కొద్దిరోజులు దాకా తని చెవిలో సౌండ్ వినిపించిందట.
ఆ చెవి సరిగా పని చేయలేదట.నిజానికి ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఉండకపోయేది కానీ నరేష్ 90 ఎంఎం స్క్రీన్ లో కర్రతో కొట్టే సన్నివేశం కరెక్ట్ గా కనిపించాలని, నేచురల్ గా రావాలని భావించాడు.
అందుకే రెండు కరెంట్ పోల్స్ మధ్య ఈ సన్నివేశాన్ని చేయాలని దర్శకుడిని కోరాడు.వారు అలాగే చేశారు.
కానీ ఆర్టిస్ట్‌కి దెబ్బ తగలకుండా ఎలా కొట్టాలో చెప్పలేదు.కట్ చేస్తే అల్లరి నరేష్ కు బాగా గాయం అయింది.
తర్వాత కోలుకోగలిగాడు.అలానే ఈ క్యారెక్టర్ వల్ల నరేష్ కి చాలా గొప్ప పేరు వచ్చింది.
అందుకే నో పెయిన్ నో గేయిన్ అని పెద్దలు అంటారేమో అని నరేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.