అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) ఎన్నికైన తక్షణం పలు కేబినెట్ పదవులకు, కీలక పోస్టులకు సమర్ధులైన వారిని నియమించారు.ఈ క్రమంలోనే ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్ధలో సమూల మార్పులే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ( DOGE ) అనే వ్యవస్ధను కొత్తగా నెలకొల్పారు ట్రంప్.
దీనికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో( Elon Musk ) పాటు భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామిలను( Vivek Ramaswamy ) సారథులుగా నియమించారు.అయితే అనూహ్యంగా వివేక్ రామస్వామి తన బాధ్యతల నుంచి తప్పుకోవడం అమెరికన్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కాగా.డీవోజీఈ కోసం ఎంపికైన ఆరుగురు యువ ఇంజనీర్లలో భారత సంతతికి చెందిన టెక్కీ ఆకాష్ బొబ్బా( Akash Bobba ) స్థానం దక్కించుకున్నారు.బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన 22 ఏళ్ల బొబ్బాతో పాటు ఎడ్వర్డ్ కొరిస్టీన్, ల్యూక్ ఫారిటర్, గౌటియర్ కోల్ కిలియన్, గవిన్ క్లిగర్, ఏతాన్ షావోట్రాన్‌లు ఎలాన్ మస్క్ టీమ్‌లో స్థానం సంపాదించారు.ఈ ఆరుగురు యువ ఇంజనీర్లు డీవోజీఈలో కీలకపాత్రలు పోషించనున్నారని అమెరికన్ మీడియా నివేదిస్తోంది.

ఆకాష్ బొబ్బా ప్రస్తుతం బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ హెడ్జ్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌గా ఉన్నారు.గతంలో మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా, థీల్స్ పలాంటిర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌గా వ్యవహరించారు.అయితే వారికి ప్రభుత్వపరమైన అనుభవం తక్కువగా ఉండటంతో సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.ఈ యువ ఇంజనీర్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడంలో వారి సామర్ధ్యం, అనుభవాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే.ఎలాన్ మస్క్‌తో విభేదాల వల్లే వివేక్ రామస్వామి తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఈ నేపథ్యంలో వివేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.తామిద్దరం ఒకే ఆలోచనతో ఉన్నానని.కాకపోతే తాను చట్టాలను నమ్మితే, మస్క్ టెక్నాలజీని విశ్వసిస్తారని రామస్వామి అన్నారు.దేశాన్ని రక్షించడంపై మా మధ్య పరస్పరం చర్చలు జరిగాయని.
ఇద్దరం ఒకే అంశంపై పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.