ఛీ, ఎంత కర్మరా బాబు.. తండ్రి శవాన్ని ముక్కలు చేసి పంచుకుంటారా.. కడుపు తరుక్కుపోయేలా గొడవ!

తల్లిదండ్రులు కళ్లెదుటే ఉన్నంత వరకు ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది.వాళ్లు కనుమరుగైతే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుంది.

 Man Demands Half Of Deceased Father Body After Cremation Dispute In Madhya Prade-TeluguStop.com

ఆ నరకం భరించలేం కూడా.అయితే మనం ఎంత వద్దనుకున్నా బంధాలు తెగిపోతుంటాయి, అనుబంధాలు అర్థం లేకుండా పోతుంటాయి.

ఇక వారి మరణం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో చెప్పలేం.అలాంటి విషాదంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో( Madhya Pradesh ) ఓ ఊహించని ఘటన జరిగింది.

తండ్రి అంత్యక్రియల( Father Last Rites ) విషయంలో ఇద్దరు అన్నదమ్ములు చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం, టికమ్‌గఢ్( Tikamgarh ) జిల్లాలోని లిధౌరా తాల్ గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

ధ్యాని సింగ్ ఘోష్ అనే 85 ఏళ్ల వృద్ధుడు సోమవారం ఉదయం కన్నుమూశారు.ఆయన చిన్న కుమారుడు దామోదర్ తండ్రి బాగోగులు చూసుకుంటూ అంత్యక్రియలకు సిద్ధమవుతున్నాడు.ఇంతలో పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్ తన కొడుకుతో పాటు మరికొందరితో అక్కడికి వచ్చి అంత్యక్రియలు తానే చేస్తానని పట్టుబట్టాడు.

Telugu Funeral, Rites, Madhya Pradesh, Rivalry Funeral, Tikamgarh-Latest News -

తండ్రి తనతోనే ఉన్నందున అంత్యక్రియలు చేసే హక్కు తనకే ఉందని దామోదర్ తెగేసి చెప్పాడు.దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.గ్రామస్తులు, బంధువులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

ఇద్దరూ కలిసి అంత్యక్రియలు చేయాలని సూచించారు.కానీ కిషన్ మాత్రం ఒప్పుకోలేదు.

అందరూ షాకయ్యేలా తండ్రి శరీరాన్ని రెండు భాగాలుగా కట్ చేసి వేర్వేరుగా అంత్యక్రియలు జరుపుకుందామని డిమాండ్ చేశాడు.ఈ ప్రతిపాదన విని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

Telugu Funeral, Rites, Madhya Pradesh, Rivalry Funeral, Tikamgarh-Latest News -

ఎంత నచ్చజెప్పినా కిషన్ తన పట్టు వీడలేదు.దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు సోదరులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.చాలాసేపటి తర్వాత వారు శాంతియుతంగా అంత్యక్రియలు చేయడానికి అంగీకరించారు.అప్పుటికి గానీ ధ్యాని సింగ్ ఘోష్ అంత్యక్రియలు సజావుగా జరగలేదు.

ఈ విషాదకర ఘటన కుటుంబ కలహాలు దుఃఖ సమయంలో కూడా ఎలా ముదిరిపోతాయో తెలియజేస్తుంది.

ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు ఐక్యత, గౌరవం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube