ఎరుపు టమాటో కాకుండా పచ్చి టమాటో ను ఎప్పుడైనా తిన్నారా.. వీటిని తింటే ఇన్ని సమస్యలు తగ్గుతాయా..

ప్రతిరోజు వంట గదిలో ఎక్కువగా ఉపయోగించే కూర కాయలలో టమాటో కచ్చితంగా ఉంటుంది.ఇంట్లో ఏ వంటకం చేయాలన్నా ముందుగా టమాటో ఉండాల్సిందే.

 Have You Ever Eaten Green Tomato Other Than Red Tomato , Red Tomato ,green Tomat-TeluguStop.com

ఇది లేకుండా ఏదైనా ఏ ఆహార పదార్ధమైన చేయడానికి వీలుకాదు.అయితే ఎరుపు టమాటాలను సూప్ లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఎప్పుడైనా పచ్చి టమాటో తినడానికి ప్రయత్నించారా.దీనివల్ల కలిగే లాభాలు తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు.

పచ్చి టమోటాలో పోషకాలు ఎక్కువ ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పచ్చి టమాటో లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరానికి రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం రోగనిరోధక శక్తిని పెంచడంపై చాలామంది ప్రజలు దృష్టిపెట్టారు.పచ్చి టమాటో క్రమం తప్పకుండా తింటే శరీరంలో విటమిన్ సి పెరిగి ఒక శక్తి పెరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా వాతావరణం లో మార్పులు వచ్చినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం రాకుండా కాపాడుతుంది.

రెగ్యులర్గా పచ్చి టమాటో ను ప్రతిరోజు ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటే మనిషి కళ్ళకు ఎంతో మంచిది.ఇందులోనే బీటా కెరోటిన్ మన కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

దీనివల్ల కంటి పనితీరు సక్రమంగా ఉంటుంది.కంటి చూపు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల వల్ల చాలామంది ప్రజలు బిజీ బిజీగా జీవిస్తున్నారు.దిని కారణంగా ప్రజల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా పెరిగిపోతుంది.

దీని వల్ల అధిక రక్తపోటు సమస్యలు కూడా వస్తున్నాయి.ఈ పరిస్థితిలో ఆకుపచ్చ టమాటాలు తినడం వల్ల మన శరీరానికి పొటాషియం ఎక్కువగా లభించి దానివల్ల రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube