మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైల్వే స్టేషన్లకు వెళ్లే ఉంటారు.అక్కడ మనకు రైల్వే స్టేషన్ పేరుతో పసుపు రంగు నేమ్ బోర్డ్స్ దర్శనమిస్తూ ఉంటాయి.
అయితే రైల్వే స్టేషన్లలో పసుపు రంగులోనే నేమ్ బోర్డ్స్ ఎందుకు కనిపిస్తాయనే ప్రశ్న చాలామందికి కలుగుతూ ఉంటుంది.బోర్డు పసుపు రంగులో ఉండగా వాటిపై అక్షరాలు మాత్రం నలుపు రంగులో కనిపిస్తాయి.
రైల్వే స్టేషన్లలో బోర్డులతో పాటు స్కూళ్లు, కాలేజీల బస్సులకు కూడా పసుపు రంగునే వినియోగిస్తారు.
అయితే నేమ్ బోర్డ్స్ ఇలా పసుపు రంగులో ఉండటానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.
మనలో ప్రతి ఒక్కరూ రెయిన్ బో రంగులైన VIBGYOR గురించి వినే ఉంటారు.వయొలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యల్లో, ఆరంజ్, రెడ్ రంగులనే షార్ట్ కట్ లో VIBGYOR అని అంటారు.
ఇందులో వయిలెట్ కలర్ నుంచి రెడ్ కలర్ వేవ్ లెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది.వయొలెట్ కు తక్కువ వేవ్ లెంగ్త్ ఉంటే రెడ్ కు మాత్రం ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది.
అయితే వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పటికీ రెడ్ కలర్ ను డేంజర్ కు సింబల్ గా భావిస్తారు.ఆరంజ్ కలర్ పగటి పూట బాగానే కనిపించినా రాత్రి సమయంలో మాత్రం ఆరంజ్ తో పోలిస్తే పసుపు రంగే కంటికి ఇంపుగా కనిపిస్తుంది.
ఎక్కువ రిఫ్లెక్షన్ వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షించగలదు.అందువల్లే రైల్వే స్టేషన్లలో బోర్డులపై పసుపు రంగును వినియోగించడం జరుగుతుంది.
పసుపు నేమ్ బోర్డ్ వల్ల ప్రయాణికులు దూరం నుంచి కూడా సులభంగా స్టేషన్ ను గుర్తించే అవకాశం కలుగుతుంది.పసుపు రంగుపై కొన్ని రంగులు స్పష్టంగా కనిపించకపోయినా నలుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది.
అందువల్లే పసుపు రంగు బోర్డుపై నలుపు రంగు అక్షరాలు రాయడం జరుగుతుంది.మనం రోడ్డుపై ప్రయాణించే సమయంలో గమనించినా ఇతర వస్తువులతో పోలిస్తే పసుపు రంగుపైనే మన దృష్టి త్వరగా పడుతుంది.
ఈ కారణాల వల్లే రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులను, వాటిపై నలుపు రంగు పెయింట్ ను వినియోగిస్తారు.