మీ గుండె ప‌దిలంగా ఉండాలంటే..ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నేటి ఆధునిక కాలంలో గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, చెడు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ వృద్ధులే కాకుండా యువత సైతం గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు.

 Precautions For How To Keep Your Heart Healthy? Precautions, Healthy Heart, Hear-TeluguStop.com

అయితే నిజానికి కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీరే మీ గుండెను ప‌దిలంగా కాపాడుకోవ‌చ్చు.మ‌రి అసలు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? అన్న విష‌యాలు ఇప్పుడు చూద్దాం.

బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది గుండెకు ముప్పు పెరుగుతుంది.కాబ‌ట్టి, ఎప్పుడు కూడా చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకునేందుకు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.త‌ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

హార్ట్ హెల్త్‌ను మెరుగు ప‌ర‌చ‌డంలో ప్రోటీన్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

అందువ‌ల్ల‌, రెగ్యుల‌ర్‌గా మీ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్‌ను అందించాల్సిన బాధ్య‌త మీదే.

అలాగే మీ గుండె ప‌దిలంగా ఉండాలంటే మీ డైట్‌లో తృణ ధాన్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

గుండె ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు తృణ ధాన్యాల ద్వారా పొందొచ్చు. సో.జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, గోధుమ‌లు, సామలు, అరికెలు, అవిసెలు మొద‌ల‌గు తృణ ధాన్యాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోండి.

గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే రోజుకు క‌నీసం ఇర‌వై నిమిషాలైనా వ్యాయామాలు చేయాలి.వాకింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

ఇక వీటితో పాటు ఒత్తిడిని త‌గ్గించుకోవాలి.

కంటి నిండా నిద్ర పోవాలి.శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.

డైట్‌లో కూర‌గాయ‌లే కాకుండా ఆకుకూర‌లు, తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోండి.ఫ్యాట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

మ‌రియు ఫుడ్‌ను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి.ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటే మీ గుండె ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండ‌దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube