ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో నకిలీ రెస్టారెంట్ బిల్లులు కూడా సృష్టించవచ్చట.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో దుమారమే రేపుతోంది.ఒక వ్యక్తి ఏకంగా AIతో తయారుచేసిన రెస్టారెంట్ బిల్లు ఫోటోను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు.GPT-4o లాంటి AI టూల్స్ వాడితే, అచ్చు గుద్దినట్లు ఉండే నకిలీ బిల్లులను క్షణాల్లో సృష్టించవచ్చని, వీటిని చూసి చాలా వెరిఫికేషన్ సిస్టమ్స్ కూడా మోసపోతాయని అతను హెచ్చరించాడు.
“ఇకపై ‘నిజమైన ఫోటోలే’ ప్రూఫ్ అనే రోజులు పోయినట్లే” అని అతను తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.దీనికి సాక్ష్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని “ఎపిక్ స్టీక్‌హౌస్”(Epic Steakhouse ) అనే రెస్టారెంట్ పేరుతో ఉన్న ఒక బిల్లును జతచేశాడు.అందులో ఫిలెట్ మిగ్నాన్, రిబ్ ఐ, సీజర్ సలాడ్ వంటి ఐటమ్స్‌తో మొత్తం బిల్లు 277.02 డాలర్లుగా ఉంది.ఆశ్చర్యం ఏంటంటే, ఆ AI బిల్లు అచ్చం నిజమైన బిల్లులాగే ఉంది.కాగితంపై ముడతలు, స్పష్టమైన ప్రింటింగ్, వెనుకవైపు చెక్క టేబుల్ బ్యాక్‌గ్రౌండ్.ఇలా అన్నీ పక్కాగా సెట్ చేసి ఉన్నాయి.ఈ పోస్ట్ చూసి నెటిజన్లు షాకయ్యారు.
కొందరైతే ఆ AI పనితనాన్ని చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు పెట్టారు.ఒక యూజర్ అయితే, “నాకు X అనే రెస్టారెంట్ పేరు, Y అనే అడ్రస్‌తో, 277.02 డాలర్ల విలువైన, ముడతలు పడిన బిల్లును, చెక్క టేబుల్‌పై ఉన్నట్లు, లెక్కలన్నీ సరిగ్గా ఉండేలా ఒక ఫోటోరియలిస్టిక్ ఐఫోన్ ( Photorealistic iPhone )చిత్రాన్ని జనరేట్ చేసి చూపించండి చూద్దాం” అంటూ ఏకంగా AIకే సవాల్ విసిరాడు.
అయితే, మరికొందరు మాత్రం ఇందులో లోపాలను పట్టుకున్నారు.
ఒక నెటిజన్ తెలివిగా, “ఆ ‘ఎపిక్’ రెస్టారెంట్‌లో అంత తక్కువ ధరలకు ఏమీ దొరకవు” అని కామెంట్ చేశాడు.అంటే, ఆ నకిలీ బిల్లులోని ధరలు, అసలు రెస్టారెంట్ ధరలతో సరిపోలడం లేదని పసిగట్టేశాడు అన్నమాట.
దీన్నిబట్టి అది నకిలీ అనిపిస్తోందని అతను అభిప్రాయపడ్డాడు.ఈ నకిలీ వ్యవహారం కేవలం రెస్టారెంట్ బిల్లులకే పరిమితం కాదనే ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.ఇంకో యూజర్ అయితే, తాను ఇప్పటికే నకిలీ ఐడీ వెరిఫికేషన్ ఫోటోలను AIతో సృష్టించానని బాంబు పేల్చాడు.“ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ముఖం పక్కన పట్టుకుని, అందులోని ఫోటో కనిపించేలా చూపించాలి” అని AIకి ప్రాంప్ట్ (ఆదేశం) ఇవ్వగానే, అది అలాంటి ఫోటోను సృష్టించిందని చెప్పాడు.దీన్నిబట్టి నకిలీ ఐడీ ప్రూఫ్‌లు తయారుచేయడం ఎంత సులువుగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, కొన్ని ప్రాంతాలు ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయని కొందరు గుర్తుచేశారు.ఉదాహరణకు, యూరప్‌లోని చాలా దేశాల్లో రెస్టారెంట్ బిల్లులపై ఒక QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే నేరుగా అక్కడి పన్నుల శాఖ వెబ్‌సైట్‌కి లింక్ అవుతుందని ఒక యూజర్ తెలిపాడు.దీనివల్ల నకిలీ బిల్లులను గుర్తించడం సులభమవుతుంది.
ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉన్నా, కంపెనీలు త్వరగానే వీటిని కనిపెట్టేస్తాయని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా, ఈ వైరల్ పోస్ట్ పుణ్యమా అని, ప్రస్తుతం ఉన్న వెరిఫికేషన్ పద్ధతులను AI ఎలా సవాలు చేయగలదనే దానిపై పెద్ద చర్చే మొదలైంది.