రామఫలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ,జుట్టు సమస్యలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉండుట వలన సమస్యలను పరిష్కరించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రామ ఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకుని, దానిలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ తేనే కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే తలలో దురద తగ్గుతుంది.
రెండు స్పూన్ల రామఫలం గుజ్జులో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్, అరటీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన మొటిమల సమస్య తగ్గిపోతుంది.
రెండు స్పూన్ల రామఫలం గుజ్జులో ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది.
రామఫలం జ్యుస్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది.