బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే కచ్చితంగా ఈ స్మూతీ మీ డైట్ లో ఉండి తీరాల్సిందే!

ఇటీవల రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారా.? బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారా.? కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రోజు చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా? అయితే మీ లక్ష్యాన్ని మరింత వేగంగా చేరువయ్యేందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.బరువు తగ్గడం కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు చెప్పబోయే స్మూతీని ఖ‌చ్చితంగా డైట్ లో చేర్చుకుని తీరాల్సిందే.

 This Smoothie Helps In Weight Loss Quickly! Weight Loss, Smoothie, Latest News,-TeluguStop.com

ఎందుకంటే వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ స్మూతీ సూపర్ ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మరొక బౌల్ ను తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి ఒక గ్లాసు వాటర్ పోసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

Telugu Tips, Latest, Smoothie-Telugu Health

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న బాదంపప్పును పొట్టు తొలగించి వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి మరియు ఒక కప్పు ఆవు పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధమవుతుంది.

ఈ స్మూతీ సూపర్ టేస్టీగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది.

Telugu Tips, Latest, Smoothie-Telugu Health

ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ స్మూతీ సూపర్ ఎఫెక్టివ్‌ గా పనిచేస్తుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో లేదా నైట్ డిన్నర్ లో ఈ స్మూతీ ని కనుక తీసుకుంటే క్యాలరీలు చాలా త్వరగా బర్న్ అవుతాయి.దీంతో వేగంగా బరువు తగ్గుతారు.

పైగా ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి కూడా రావు.

పైగా ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.కాబట్టి వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube