ఇర్రెగ్యులర్ పీరియడ్స్.స్త్రీలలో చాలా మంది కామన్‌గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
రుతుచక్రం క్రమం తప్పడం వల్ల ఇతర శారీరక, మానసిక సమస్యలకు దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ను రెగ్యులర్ చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణాలేంటో కూడా తప్పని సరిగా తెలుసుకోవాలి.అప్పుడే ఆ సమస్య నుంచి బయట పడటం సులభం అవుతుంది.
అసలు ఇంతకీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణాలు ఏంటీ.? అంటే టక్కున రక్త హీనత, తక్కువ బరువు, ఆహారపు అలవాట్లు.దాదాపు అందరూ వీటినే చెబుతుంటారు.కానీ, మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
మరి ఆలస్యమెందుకు అవేంటో కూడా చూసేయండి.
నిద్రలేమి.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి ఇదీ ఒక కారణం.ప్రస్తుత రోజుల్లో చాలా మంది అమ్మాయిలు స్మార్ట్ పోన్లతో టైమ్‌ను గడిపేస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఫలితంగా స్ట్రెస్ పెరిగి రుతు చక్రం గాడి తప్పుతుంది.అలాగే కొందరు బరువు తగ్గాలనే అతి ఉత్సాహంతో అధిక వ్యాయామాలు చేస్తుంటారు.
ఓవర్‌గా వ్యాయామాలు చేయడం వల్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి దారి తీస్తుంది.

అంతే కాదు.జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం, బరువు పెరగడం, గర్భనిరోధక మాత్రలను తరచూ వాడటం, హార్మోన్ల అసమతుల్యత, మద్యపానం అలవాటు వంటివి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణాలు అవుతుంటాయి.అందుకే వీటిని మార్చు కోవడంతో పాటుగా డైట్‌లో బొప్పాయి, క్యారెట్, బీట్ రూట్, అల్లం, దాల్చిన చెక్క, సోంపు, బెల్లం, నువ్వులు, పసుపు, ఖర్జూరం, కొత్తి మీర, ఆపిల్ సిడర్ వెనిగర్, నారింజ, నిమ్మ, కివి, మామిడి వంటి పండ్లు, వంటివి డైట్‌లో చేర్చు కోవాలి.
తద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య దూరం అవుతుంది.