పొట్ట వద్ద కొవ్వు భారీగా పేరుకుపోయిందా.? బెల్లీ ఫ్యాట్ ( Belly fat )కారణంగా బాడీ షేప్ అవుట్ అయ్యిందా.? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే టెన్షన్ వద్దు.పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే సూపర్ డ్రింక్ ఒకటి ఉంది.ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin ), వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ), వన్ టేబుల్ స్పూన్ సోంపు( anise ), రెండు మెత్తగా దంచిన మిరియాలు( Pepper ) మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తురుము వేసుకుని మరిగించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో డ్రింక్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.
బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసుకోవడానికి ఈ డ్రింక్ ఎంతో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

అలాగే నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గు ముఖం పడతాయి.అధిక బరువు నుంచి బయటపడతారు.కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు బయటకు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.
అంతేకాకుండా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
మరియు జీర్ణ క్రియ పనితీరును సైతం పెంచుతుంది.







