దేవుడికి హారతి ఎందుకు ఇవ్వాలి? దాని వల్ల లాభమేమిటి?

ఇంట్లోనూ, పూజా గదిలోనే కాదు గుడిలోనూ, శుభ కార్యాలప్పుడు… పిల్లల పుట్టిన రోజున వేడుకల్లోనూ, కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తుంటారు.అసలు ఎందుకిలా హారతి ఇస్తారనే అనుమానం అందరికీ వచ్చే ఉంటుంది.

 Why Give Harathi To God What Is The Benefit Of That, Devotional, Harathi, Karpur-TeluguStop.com

సమాధానం తెలియకపోయినప్పటికీ… హారతి మాత్రం ఇచ్చేస్తుంటారు చాలా మంది.కానీ మనం చేసే ఏ పని వెనకైనా ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి.ఆ తర్వాతే ఆ పని చేయాలి.ఎక్కడ హారతి పట్టినా దానికి ఓ ఆరోగ్య సూత్రం ఉంది.శుభకార్యాల్లో స్నేహితులు, బంధువులు, గ్రామస్థులంతా ఒకే చోట చేరుతారు.అలాగే దేవాలయంలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు.

దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది.అనేక క్రిములు చేరతాయి.

హారతి తర్వాతే తీర్థ ప్రసాదాలు.

కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి.అందుకే హారతి ఇచ్చిన తర్వాతే దేవుడికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.అంతే కాదు ఆ తర్వాతే భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలను అందజేస్తారు.

అంటు వ్యాధులు అంటవూ.

హారతి కళ్లకు అద్దుకోవడం వల్ల ముక్కుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.అలాగే అంటు వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి.కర్పూర హారతి ఎలాగైతే క్షీణించి పోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అందరూ బాగుండాలి అని కోరుకుంటూ హారతిని కళ్లకు అద్దుకోవటమే అసలు సిసలు ఆథ్యాత్మిక అర్థం.పరమార్థమని పండితులు వివరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube