ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడిని విశ్వసించే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పూజగది( Pooja Room ) కచ్చితంగా ఉంటుంది.అవకాశం లేనివారు దేవుడి చిత్రపటాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అలాగే నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు తమ ఇళ్లలో పూజ గది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.అలాగే అన్ని వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటూ ఉంటారు.
అయితే ఆ పూజ గదిలో కేవలం దేవుడు చిత్రపటాలు పెట్టి కొందరు అలానే వదిలేస్తూ ఉంటారు.అలా కాకుండా పలు మార్పులు చేయడం ద్వారా పూజ గదిని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరి పూజ గదిని ఆకర్షణీయంగా ఎలాగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటి స్థలానికి అనుగుణంగా బిల్డర్ ఎన్ని ఇంటీరియర్ డిజైన్లు చూపించిన పూజగది విషయంలో మాత్రం అందరూ తప్పకుండా వాస్తునే ఫాలో అవుతూ ఉంటారు.వాస్తు ప్రకారం మనం ఇంట్లోనీ పూజ గది ఈశాన్య దిశ( Northeast direction )లో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలాగే పూజగది శుభ్రంగా ఉంటే పూజ గదిలో కాలు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయని కూడా చెబుతున్నారు.
ఇంట్లో మిగతా గదుల సీలింగ్ ఎంత ఎత్తులో ఉన్నా సరే పూజ గది సీలింగ్ మాత్రం తక్కువగా ఉండాలని చెబుతున్నారు.అలాగే దేవుడి విగ్రహాన్ని ఏదో మూలకు పెట్టకుండా గదిలో మధ్య భాగంలో ఉంటే మంచిదని చెబుతున్నారు.

అలాగే పూజ గదిలో దేవుడిని ఆరాధించడంతోపాటు కొందరు మెడిసి మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు.కాబట్టి గది లో మంచి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.ఒక వేళ వెలుతురు వచ్చే ఛాన్స్ లేకపోతే మంచి ఎల్ఈడీ లైట్లు( LED lights ) ఏర్పాటు చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే ఇప్పటికే ఇంట్లో పూజ గది ఉన్నట్లయితే దాన్ని ఎలా మేకోవర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో లభించే పీవీసీ షీట్స్ ను పలు డిజైన్లలో కట్ చేసి గోడకు అతికించాలి.తక్కువ ఖర్చుతో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇవి కలిగిస్తాయి.పూజ గదిలో ఇత్తడి వస్తువులను ఉంచవచ్చు.అలాగే పూజ గదిలో వెండి లేదా రాగి ఫ్రేమ్ తో తయారు చేసిన దేవుడు ఫోటో చిత్రాలను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.