టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya> అలాగే హీరోయిన్ శోభిత దూళిపాల(sobhita dhulipala ) గత ఏడాది డిసెంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.సమంతతో(Samantha) విడిపోయిన తర్వాత శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు.
దీంతో ఈ జంట సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు.ఇకపోతే నాగ చైతన్య పెళ్లి తర్వాత విడుదలవుతుందని చిత్రం తండేల్.
అయితే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా శోభిత అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ని తెలిపింది.

ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్న విషయానికి వస్తే. తండేల్ రిలీజ్ (Thandel release)సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూ శోభిత(sobhita) ఒక పోస్ట్ చేసింది.తండేల్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను.తండేల్ చిత్ర షూటింగ్ జరిగినన్ని రోజులు నువ్వు చాలా పాజిటివ్ గా, ఫోకస్డ్ గా కనిపించావు.
అందరితో పాటు నేను కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూడలేకున్నాను అని శోభిత తన భర్త చిత్రం గురించి పోస్ట్ చేసింది.అయితే ఆమె సంతోషం మరొకటి ఉంది.
ఫ్యాన్స్ కి ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది.ఫైనల్ గా నువ్వు గడ్డం షేవ్ చేస్తావు.

మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ శోభిత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.శోభిత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ పోస్ట్ పై అక్కినేని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా నాగచైతన్య శోభిత గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.కానీ ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.గత ఏడాది ఆ విషయాన్ని ఎంగేజ్మెంట్ వేడుకతో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
పెళ్లి తర్వాత సినిమాలలో శోభిత నటిస్తుందా లేదా అన్న విషయాలపై ఇంకా ఆమె స్పందించలేదు.మరి నాగచైతన్య నటించిన సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.







